Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR: 25 ఏళ్ల తర్వాత నేనేంటో చూస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన

Junior NTR: 25 ఏళ్ల తర్వాత నేనేంటో చూస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన

Junior NTR: సాధారణంగా సినీ పరిశ్రమ నుంచి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎక్కువ ప్రభావం చూపగల రంగం కావడంతో సినీ పరిశ్రమ వ్యక్తులకు.. రాజకీయరంగంలో అవకాశాలు చాలా ఎక్కువ. అలాగని రాజకీయాల్లోకి వచ్చిన సినీ వ్యక్తులు పూర్తిస్థాయిలో రాణించిన సందర్భాలు లేవు. తమిళనాడు మాత్రం సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తులు బాగానే రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి నందమూరి తారక రామారావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాగానే రాణించారు రాజకీయాల్లో. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి వచ్చినట్టే వచ్చి కలిసి రాకపోవడంతో తిరిగి సినిమా రంగంలోకి వెళ్లిపోయారు. నందమూరి బాలకృష్ణ మాత్రం పొలిటికల్ తో పాటు సినిమాను సమాన ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సైతం వచ్చినట్టే వచ్చి మళ్లీ సినిమా రంగానికి పరిమితమయ్యారు. కానీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఒక కార్యక్రమంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ పై విస్తృతమైన చర్చ నడిచింది.

Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!

* పొలిటికల్ ఎంట్రీ పై చర్చ..
జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) నందమూరి నట వారసుడిగా.. మూడోతరం హీరోగా వెలుగులోకి వచ్చారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆహార్యం ఉండడం, టాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర చాటుకోవడంతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఈ క్రమంలోనే 2009లో తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ ఎన్నికల తర్వాత రాజకీయాలతో పాటు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఆ సమయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపించింది. సొంత పార్టీ శ్రేణులతో పాటు సీనియర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వినిపించారు. కానీ టిడిపి నాయకత్వం జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ మాటలను పట్టించుకోలేదు.

* చమత్కారంగా సమాధానం..
2024 ఎన్నికల్లో టిడిపి( Telugu Desam Party) కూటమి కట్టి సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యం పెరిగింది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేష్ అని తేలిపోయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ విషయం ప్రస్తావనకు రావడం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెడతారని ఆ మధ్యన ప్రచారం నడిచింది. కానీ ఆయన ధ్యాస మాత్రం సినిమాలపైనే ఉంది. ఈ తరుణంలో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా అక్కడ ప్రజెంటర్ ఒకరు జూనియర్ ఎన్టీఆర్ 25 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దానికి ధీటైన సమాధానం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. పాతికేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు 67 సంవత్సరాల వయసు అవుతుందని చమత్కారంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే భవిష్యత్తుపై జూనియర్ ఎన్టీఆర్కు ఒక ఆలోచన ఉందని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version