Homeపండుగ వైభవంతిరుప‌తిలో..... వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ఎవ‌రు క‌ట్టించారు! కొండ‌పై నేను అవ‌త‌రించాననే క‌ల ఎవ‌రికొచ్చింది!?

తిరుప‌తిలో….. వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ఎవ‌రు క‌ట్టించారు! కొండ‌పై నేను అవ‌త‌రించాననే క‌ల ఎవ‌రికొచ్చింది!?

Tirumala History:  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. తిరుమల కొండపై వెలసిన దేవదేవుడు మహావిష్ణువు అవతారంగా చెబుతారు. కోరిన కోర్కెలు తీర్చే వెంకటేశ్వరుడి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు ఈ ఆలయం ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఎవరికి కల వచ్చింది? ఏమిటా రహస్యం అనే వాటిపై తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

కలియుగ ఆరంభంలో ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. వెంకటేశ్వరుడు కలలో తొండమాన్ చక్రవర్తికి కనిపించి తనకు ఆలయం నిర్మించాలని సూచిస్తాడట. అంతే వెంటనే తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణానికి పూనుకుని అత్యంత వేగంగా దేవాలయం నిర్మించినట్లు చెబుతారు. తాను వెంకటేశ్వరుడి అవతారంలో కొండపై కొలువుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మ చే ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Also Read: గాల్లో వేలాడే స్తంభం.. లేపాక్షిలో ఎన్నో విశిష్టతలు

ఆలయాన్ని ఆగమం ప్రకారం నిర్మించారు. దీంతో పూజలు కూడా అదే పద్ధతిలో నిర్వహిస్తారు. తొండమాన్ చక్రవర్తి తరువాత చాలా మంది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆధారాలున్నాయి. ఆలయంలోని ఆనంద నిలయం గోపురానికి చాలా మంది బంగారు తాపడం చేయించినట్లు తెలిసిందే. తరువాత కాలంలో మరమ్మతులు కూడా చేపట్టారు. తిరుమల తిరుపతి ఆలయం నిర్మాణం వెనుక ఉన్న కథ ఇదే కావడం గమనార్హం.

Tirumala History
Tirumala History

వడ్డీ కాసులవాడిగా పూజలందుకుంటున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు విచ్చేసి పూజలు చేస్తుంటారు. కలియుగ దైవంగా ఖ్యాతిగాంచిన వెంకటేశ్వర సా్వామి దేవాలయం ఎంతో విశిష్టత పొందింది. ఎందరో రాజులు ఈ ఆలయాన్ని నిర్మించడంలో తమదైన సాయం చేశారని చెబుతారు. విజయనగర రాజులు కూడా దీనికి మరమ్మతులు చేయించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు కూడా గోపురానికి బంగారు తాపడం చేయించారని తెలుస్తోంది.

Also Read: క్యాన్సర్‌ ను జయించిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోన్న హీరోయిన్
Recommended Videos
Pakka Commercial Movie First Day Collections || Pakka Commercial Movie Collections || Gopi Chand
లైగ‌ర్ బోల్డ్ లుక్  వైర‌ల్‌..|| Vijay Devarakonda Liger Look  || Vijay Devarakonda Bold Look
స్టేజ్ మీద భార్యను పరిచయం చేసిన హైపర్ ఆది|| Hyper Aadi Introduced His Wife On Dhee Show Stage

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version