ఏపీలో మరోసారి సీఈసీ వర్సెస్ సర్కార్ పరిస్థితులు తప్పేలా లేవు. దీనికితోడు హైకోర్టు కూడా జగన్‌కు సహకరించేలా లేదు. ఇప్పటికే చాలా పిటిషన్లపై ఎదురుదెబ్బ తిన్న జగన్ సర్కార్‌పై మరోసారి ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈసీ వినతులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి సీఈసీగా రావడంతో.. ప్రభుత్వం నాన్ కో ఆపరేటివ్‌గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు మారుతాయి.. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని.. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.
Also Read: టీడీపీ తమ్ముళ్లతో వైసీపీ క్యాడర్ దోస్తానా?
ఈసీకి సంబంధించి మూడు రోజుల్లో ప్రభుత్వానికి సవివర వినతిపత్రం ఇవ్వాలని.. ప్రభుత్వం నివేదికను 15 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వొకేట్ నియమించుకుంటే.. సొంత చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. ఆయన ఇంటి కోసం రూ.20 లక్షలు, ఫర్నిచర్‌కు రూ.15 లక్షల అంశంపై ఈసీ మరోసారి పరిశీలించాలని సూచించింది. అలాగే కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని.. ఇదంతా ప్రజల సొమ్మేనని వ్యాఖ్యానించింది.
Also Read: బిహార్ భవితవ్యం తేల్చనున్న రెండో విడత ఎన్నికలు
ఒకవేళ జగన్ ప్రభుత్వం సీఈసీకి సహకరించాల్సి వస్తే ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ముహూర్తం పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాను వేసిన పిటిషన్‌పై సానుకూల తీర్పు రావడంతో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వీటన్నింటినీ ఎలా ఎదుర్కోబోతోందో చూడాలి.