దేశ ప్రజలకు శుభవార్త.. నిమిషాల్లో కరోనా రిపోర్ట్ చెప్పే యాప్ రెడీ!

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు తెలుపుతున్నారు. భారత్ తో పాటు ఇతర దేశాల్లో చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. Also Read: కరోనాలో మరో కొత్త లక్షణం.. నిమిషాల్లో చంపేస్తుందట..? కొందరిలో తొలుత లక్షణాలు కనిపించకపోయినా వైరస్ శరీర […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2020 8:13 pm
Follow us on


ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు తెలుపుతున్నారు. భారత్ తో పాటు ఇతర దేశాల్లో చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధిని గుర్తించలేకపోతున్నారు.

Also Read: కరోనాలో మరో కొత్త లక్షణం.. నిమిషాల్లో చంపేస్తుందట..?

కొందరిలో తొలుత లక్షణాలు కనిపించకపోయినా వైరస్ శరీర అవయవాలపై దాడి చేస్తుండటంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వేగంగా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. లక్షణాలు కనిపించని వారికి కరోనా సోకిందో లేదో తెలిసేలా శాస్త్రవేత్తలు కొత్త యాప్ ను తయారు చేశారు. ఈ యాప్ తో కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోతే తెలుస్తుంది.

అమెరికాలోని మనాచుసెట్స్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ యాప్ ను తయారు చేశారు. ఒక వ్యక్తి దగ్గే దగ్గును బట్టి ఆ వ్యక్తి సాధారణంగా దగ్గుతున్నాడో లేక ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయో ఈ యాప్ కనిపెడుతుంది. అయితే ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. కరోనా సోకిన వాళ్ల దగ్గులను ఈ యాప్ లో పొందుపరిచారు.

Also Read: ఆస్తమాతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్..?

దీంతో ఈ యాప్ కరోనా దగ్గుకు, సాధారణ దగ్గుకు సులభంగా తేడాను కనిపెట్టగలుగుతుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి యాప్ ల వల్ల ప్రజలు వైరస్ సోకిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.