జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్‌

పోలవరం ప్రాజెక్టుపై ఇన్నాళ్లు నెలకొన్న గందరగోళానికి కేంద్రం పరిష్కారం చూపింది. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి మోడీ సర్కార్‌‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ ఎట్టకేలకు స్పందిస్తూ.. పోలవరం బకాయిలపై సానుకూలంగా స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపింది. […]

Written By: NARESH, Updated On : November 3, 2020 9:52 am
Follow us on

పోలవరం ప్రాజెక్టుపై ఇన్నాళ్లు నెలకొన్న గందరగోళానికి కేంద్రం పరిష్కారం చూపింది. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి మోడీ సర్కార్‌‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ ఎట్టకేలకు స్పందిస్తూ.. పోలవరం బకాయిలపై సానుకూలంగా స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపింది. మొత్తం రూ.2,234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో వైసీపీ ప్రభుత్వం పెద్దల్లో ఆనందం వ్యక్తమైంది. పీపీఏ ప్రక్రియ కూడా పూర్తి చేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ సూచించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది.

Also Read: ఓటుకు నోటు కేసు: ఎమ్మెల్యే సండ్రకు కోర్టులో గట్టి షాక్

పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం, కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించి గుడ్‌న్యూస్‌ చెప్పింది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. కాగా.. ఇటీవలే ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సైతం పలువురు పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు సంబంధించి అభ్యర్థనలు అందజేశారు. దీనికితోడు నిధులను పెండింగ్‌లో పెట్టేందుకు సాంకేతిక కారణాలు కూడా లేవు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది.

Also Read: నెల్లూరులో పది మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్సింగ్.. చివరకు..?

పోలవరం విషయంలో ఇన్నాళ్లు జగన్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చిన కేంద్రం.. తాజాగా సంతోషకరమైన వార్త చెప్పడంతో ప్రభుత్వంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ పోరాటం ఫలించిందని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్షాల నోళ్లకూ తాళాలు పడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది.