Jharkhand Elections : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్ శనివారం(నవంబర్ 23న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల ఫలితాలు వచ్చాయి.
జార్ఖండ్ జేఎంఎందే..
జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 41 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ జేఎంఎం ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. అయితే జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ సీఎం అయ్యారు. అయితే కుంభకోణం కేసులో సోరేన్ అరెస్ట్ అయ్యారు. ఆరు నెలలు జైల్లో ఉన్నారు. విడుదలయ్యాక మళ్లీ ఆయన సీఎం బాధ్యతుల చేపట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్‌తోపాటు మరో రెండు చిన్న పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. బీజేపీ కూడా రెండు చిన్న పార్టీలతో కలిసి కూటమిగానే బరిలో దిగింది. అయితే తాజా ఎన్నికల్లో మొదట బీజేపీ ఆధిక్యం కనబర్చినా.. తర్వాత వెనుకబడింది. ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఆధిక్యం కనబరుస్లోంది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 51 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, బీజేపీ కూటమి కేవలం 28 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. దీంతో జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం ఖాయమని అంటున్నారు. అయితే ఇంకా కౌంటింగ్ పూర్తికానందున హరియానా తరహాలో మళ్లీ మ్యాజిక్ జరిగితే అధికారం మారే అవకాశం ఉంది.
జేఎంఎం రికార్డు..
జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. కానీ, జేఎంఎం ఈసారి చరిత్ర సృష్టించబోతోంది. ప్రస్తుతం జేఎంఎం కూటమిలో జేఎంఎం మెజారిటీ సీట్లలో విజయం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ తర్వాతి స్థానంలో ఉండగా, మరో రెండు ప్రాంతీయ పార్టీలు కూడా సీట్లు గెలిచే అవకాశం ఉంది. దీంతో జేఎంఎం కూటమి అధికారం చేపట్టడం ఖాయమైంది. దీంతో జార్ఖండ్‌లో జేఎంఎం కొత్త చరిత్ర లిఖించినట్లు అవుతుంది. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా జేఎంఎంవైపే మొగ్గు చూపారు. ఇక ఆ పార్టీ ప్రకటించిన ఆర్థిక సాయం కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.