https://oktelugu.com/

Akhanda 2 : అఖండ 2 సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడా..?

ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన కొన్ని కాంబినేషన్ లకు మంచి గుర్తింపు ఉంది. వీళ్ల కలయిక లో సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కూడా తిరగరాసే సత్తా ఉన్న సినిమాగా నిలిచిపోతుందనే కాన్ఫిడెంట్ అయితే ప్రేక్షకుల్లో నాటుకు పోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 12:21 PM IST

    Is Hollywood star hero acting in Akhanda 2?

    Follow us on

    Akhanda 2 : ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన కొన్ని కాంబినేషన్ లకు మంచి గుర్తింపు ఉంది. వీళ్ల కలయిక లో సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కూడా తిరగరాసే సత్తా ఉన్న సినిమాగా నిలిచిపోతుందనే కాన్ఫిడెంట్ అయితే ప్రేక్షకుల్లో నాటుకు పోయింది. ఇక ఇలాంటి కాంబినేషన్ లో బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఒకటి…

    బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. నిజానికి వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఉంది. బాలయ్య బాబు అభిమానులు బోయపాటితో సినిమా ఎప్పుడు వస్తుందా? అంటూ చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అఖండ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ మరోసారి భారీ సక్సెస్ ని సాధించడంతో ఇప్పుడు అఖండ 2 సినిమాని తెరమీదకి తీసుకొస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ సినిమాలో కూడా మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా భిన్నంగా చిత్రీకరించాలని ఇంతకుముందు ఏ సినిమాలో లేని విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని కొరియోగ్రఫీ చేయించాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేయిస్తున్నాడట.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక హాలీవుడ్ స్టార్ ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా రేంజ్ ను పెంచడానికి ఆయన ఆ నటుడిని తీసుకొస్తున్నాడా లేదంటే సినిమా మీద హైప్ ని పెంచి భారీ వసూళ్లను రాబట్టాలని అలా చేస్తున్నాడా అనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తానికైతే హాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోని ఇందులో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా బోయపాటి చేస్తున్న ఈ ప్రయోగం భారీ సక్సెస్ ని సాధించాలని బాలయ్య బాబు అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే వరుసగా నాలుగు విజయాలను సాధించిన కాంబినేషన్ గా బోయపాటి బాలయ్య కాంబో చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే.

    ఇక రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా భారీ రికార్డ్ లను బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…