కరోనా కారణంగా ప్రజలు, ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నం అయ్యాయి. చేసుకుందామంటే పనుల్లేక.. పలువురు ఉద్యోగాలను కోల్పోయి.. ఉపాధికి దూరమయ్యారు. దీంతో అప్పటి నుంచి కేంద్రం ఏదో ఒక ప్యాకేజీని ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో భారీ ప్యాకేజీ విడుదలకు కేంద్రం సిద్ధం.. ఆ రంగాలకు భారీ ఊరట..!
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సంకేతాలిచ్చారు. అయితే ఏ తేదీన ప్రకటిస్తారన్నది ఇంకా వెల్లడించలేదు. ‘ఏ రంగానికి లేదా ఏ సమూహానికి ఏరకమైన సహాయం అవసరమో… నిరంతరం అంచనా వేస్తూనే ఉన్నాం. దాని ప్రకారం కచ్చితంగా స్పందిస్తూనే ఉంటాం’ అంటూ పాండే స్పష్టం చేశారు. ఈ విషయంపైనే ఎప్పటికప్పుడు పారిశ్రామిక వేత్తల నుంచి, ట్రేడ్ యూనియన్ నేతల నుంచి, వివిధ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారాన్ని, సలహాలను స్వీకరిస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు.
ఉద్దీపన ప్యాకేజీ విషయంలో సరైన తేదీని మాత్రం చెప్పలేమని, కానీ.. దీనిపై చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని, ప్రభుత్వం ఈ దిశగానే చర్చలను నడిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కొద్ది కొద్దిగా దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, నిరంతర వృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు. అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 105,155 కోట్ల రూపాయలని, ఇది గతేడాది ఇదే నెలకంటే 10 శాతం ఎక్కువని తెలిపారు. విద్యుత్ వినియోగంలో కూడా వృద్ధి కనిపిస్తోందని అజయ్ భూషణ్ పాండే తెలిపారు.
Also Read: ఆడబిడ్డలపై కన్నేస్తే అంతిమయాత్రే: యోగి వార్నింగ్
మరోసారి కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే అటు పరిశ్రమలు.. ఇటు ప్రజలకు బూస్టింగ్ లాంటి న్యూసే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఆ ప్యాకేజీ సామాన్యులకు ఉపయోగపడేలా.. వారి వరకు చేరేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.