Duchenne muscular dystrophy : ఆ వ్యాధిని డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అని పిలుస్తారు. దీనిని “పీడియాట్రిక్ న్యూరోమాస్కులర్ డిజార్డర్” అని కూడా అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా సోకుతుంది. ముఖ్యంగా మగ పిల్లలకు మాత్రమే ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి వల్ల కండరాల బలహీనత చోటు చేసుకుంటుంది. మగ పిల్లలకు నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. ఆ తర్వాత అంచనాలకు అందని విధంగా శరీరంలో వ్యాప్తి చెందుతుంది.. వాస్తవానికి ఈ వ్యాధిని జన్యువుల లోపం వల్ల మగపిల్లల సంభవించే వంశపారంపర్య కండరాల రుగ్మత గా డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన ప్రారంభ సమయంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత క్రమేపి తీవ్రమైన కండరాల క్షీణత మొదలవుతుంది. నడవడానికి శక్తి ఉండదు. శ్వాస కోశ సమస్యలు ఎదురవుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధి బారిన పడ్డారు. ప్రారంభంలో వారికి ఈ వ్యాధి సోకిందనే విషయం తెలియదు. వైద్యుల పరీక్షల్లో ఈ వ్యాధి సోకిందని తెలిసింది. వాస్తవానికి ఆ ఇద్దరు అన్నదమ్ములు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేవరకు చలాకీగా ఉన్నారు. వారిలో శారీరక ఎదుగుదల కూడా బాగానే ఉంది. తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద వాడు శారీరకంగా బలహీనంగా మారిపోవడం మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించి పరీక్షల నిర్వహించగా.. అతడికి డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) సోకినట్టు తీరింది. ఇదే సమయంలో తమ్ముడికి కూడా అవే పరీక్షలు నిర్వహించగా.. అతడికి కూడా డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) సోకిందని తీరింది. ఒకే తల్లి కడుపులో పుట్టడంతో వారిద్దరికీ ఈ వ్యాధి సోకిందని వైద్యులు చెబుతున్నారు..డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అనేది జన్యుపరమైన వ్యాధి అని.. తోబుట్టువులకు మాత్రమే ఇది సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చికిత్స అందుబాటులో లేదని.. కొంతకాలం ఇలానే వారి జీవించి ఆ తర్వాత చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు యుక్త వయసు కంటే ముందే చనిపోతారట.
అయితే ఈ వ్యాధికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ ముందుకు వచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నారు. ఒక వ్యక్తి ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని కోరడంతోనే అవసరాల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ఒక మహిళ గర్భం దాల్చిన మూడవ నెలలో 3 వేల రూపాయల విలువైన ప్రీ నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ చెబుతున్నారు. ఒకవేళ పిండానికి డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధి ఉన్నట్టయితే తక్షణమే గర్భం తీయించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా గర్భస్రావం సేవించడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే వారి పుట్టిన తర్వాత బతికించుకోవడం కష్టమై.. కళ్ళముందే చనిపోతుంటే తట్టుకోలేక.. ఇబ్బంది పడాల్సి ఉంటుందని శ్రీనివాస్ అంటున్నారు. గర్భం దాల్చిన సమయంలోనే మహిళలు ఆ పరీక్షలు నిర్వహించుకుంటే.. కడుపుకోతను అనుభవించాల్సిన దుస్థితి ఎదురవద్ అని శ్రీనివాస్ అంటున్నారు. “జన్యుపరమైన వ్యాధులకు సాధ్యమైనంత వరకు చికిత్స ఉండదు. అలాంటప్పుడు అవగాహన మాత్రమే వారిని జాగ్రత్త పరుస్తుంది. అందువల్లే ఈ బాధ్యతను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి జన్యుపరమైన వ్యాధిని నివారించడం సాధ్యం కాదు కాబట్టి.. ముందుగానే మేల్కొంటే మంచిదని” అవసరాల శ్రీనివాస్ చెబుతున్నారు.