https://oktelugu.com/

Attack On Mallareddy: మల్లారెడ్డిపై దాడి: కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత వల్లేనా?

Attack On Mallareddy: తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ విధానాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయా? రాజకీయ విశ్లేషణలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. ఫలితంగా ప్రభుత్వంపై ఆగ్రహం కూడా పెరిగిపోతోంది. రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. ఉద్యోగులకు వేతనాలు కూడా సరైన సమయంలో వేయడం లేదు. పింఛన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదు. దీంతో ప్రజల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 31, 2022 / 02:08 PM IST
    Follow us on

    Attack On Mallareddy: తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ విధానాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయా? రాజకీయ విశ్లేషణలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. ఫలితంగా ప్రభుత్వంపై ఆగ్రహం కూడా పెరిగిపోతోంది. రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. ఉద్యోగులకు వేతనాలు కూడా సరైన సమయంలో వేయడం లేదు. పింఛన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదు. దీంతో ప్రజల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుకు అందరు నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు.

    Mallareddy

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని చూస్తుంటే ఇది వాస్తవమే అనిపిస్తోంది. కానీ మల్లారెడ్డి మాత్రం తనపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన అనురులతో దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై జరిగిన దాడిగానే అభివర్ణిస్తున్నాయి. టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలకు కోపోద్రిక్తులైన ప్రజలు మంత్రిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు.

    Also Read: Virata Parvam: ముందుగానే రాబోతున్న ‘విరాట పర్వం’.. సాయి పల్లవి స్పెషల్ ఇంటర్వ్యూలు

    ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ పాలన గాడి తప్పుతోంది. సరైన రీతిలో పనులు చేపట్టకుండా నిధుల లేమితో బిక్కుబిక్కుమంటోంది. దీంతో పాలన అదుపు తప్పుతోంది. ఫలితంగా టీఆర్ఎస్ పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. పైగా ఈ మధ్య కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ ఏదో సాధించాని ఉవ్విళ్లూరుతుండటంతో ప్రజల్లో అసహ్యం కలుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేకున్నా జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో ప్రజలు విసిగిపోతున్నారు.

    Mallareddy

    ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని అత్యాశకు పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ తీరుతో ప్రజల్లో అసహనం వస్తోంది. ప్రజల సమస్యలు తీర్చాల్సి ఉన్నా స్వార్థం కోసం పని చేస్తున్నారే కానీ ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజమే. అందుకే మంత్రిపై దాడి చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విదానాలను అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడటం లేదు. అందుకే వారిని అడ్డుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    రాబోయే ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీకి పనిచేయాలని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎందరిని తీసుకొచ్చినా కేసీఆర్ ఓటమి ఖాయమని చెబుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేసీఆర్ వింతైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గడ్డు రోజులు వస్తాయనే జోస్యం చెబుతున్నారు మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read:Bandi Sanjay- kcr: కేసీఆర్ తో ఫైట్: సర్పంచ్ లను ఎగదోస్తున్న బండి సంజయ్

    Tags