Pawan Kalyan Apologizes To Prabhas: మన టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యణ్ మరియు యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఈ ఇద్దరి హీరోలకు ఒక్కరి మీద ఒక్కరికి మంచి అభిప్రాయం మరియు గౌరవం ఉన్నప్పటికీ, అభిమానుల మధ్య మాత్రం పలు సందర్భాలలో తీవ్రమైన గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి..ఉదాహరణకి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు భీమవరం లో పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ అభిమానుల మధ్య ఏ స్థాయి గొడవలు జరిగాయో ఇప్పటికి కూడా ఎవ్వరు మర్చిపోలేరు..ప్రభుత్వం ఈ గొడవలను అదుపు చెయ్యడానికి కోసం ఆ నియోజకవర్గం లో 144 సెక్షన్ కూడా విధించింది..ఈ గొడవ పై అప్పట్లో పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ స్పందించి అభిమానులను అదుపు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఆ స్థాయిలో ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేగింది..ఇప్పటికి ఆ ప్రాంతం లో అప్పుడప్పుడు ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎదో ఒక్క వివాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది..ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా సరిగ్గా అలాంటి గోదావనే చోటు చేసుకుంది.
ఇక అసలు విషయానికి ట్విట్టర్ లో గత కొంత కాలం క్రితం ‘స్పేస్’ అనే సరికొత్త ఫ్యూచర్ ని ప్రెవేశ పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ‘స్పేస్’ లో ట్విట్టర్ ఖాతాదారులు తమ ఫాలోయర్స్ తో లైవ్ ఇంటరాక్షన్ అవ్వొచ్చు..ఈ ఫ్యూచర్ ట్విట్టర్ లో పెద్ద హిట్ అయ్యింది..అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొంతమంది ట్విట్టర్ లో పెట్టిన స్పేస్ లో ప్రభాస్ ని ట్రోల్ చేస్తూ మాట్లాడారు..దీనికి కారణం కూడా లేకపోలేదు..సోషల్ మీడియా లో తరుచు ఫలానా హీరోల అభిమానులు గొడవ పడుతూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..అలా ప్రభాస్ అభిమానులు కొంతమంది పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేసిన దానికి రియాక్షన్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది స్పేస్ పెట్టి ప్రభాస్ ని ట్రోల్ చేసారు..దీనికి నిరసనగా ప్రభాస్ అభిమానులు ‘పవన్ కళ్యాణ్ దిగి వచ్చి ప్రభాస్ కి క్షమాపణలు చెప్పాలి..జనసేన వాళ్ళు మా హీరో మీద ట్రోల్ల్స్ వేస్తున్నారు..ఇలాగె పోతే వచ్చే ఎన్నికలలో మేము జనసేన కి ఓట్లు వెయ్యము’ అంటూ ట్విట్టర్ లో ఒక్క ప్రత్యేకమైన హాష్ టాగ్ తో ట్రెండ్ చెయ్యడం మొదలు పెట్టారు..దీనికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా తమదైన స్టైల్ లో ప్రభాస్ ఫాన్స్ కి సమాధానం చెప్తున్నారు..ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ తారాస్థాయికి చేరుకుంది.
Also Read: Bandi Sanjay- kcr: కేసీఆర్ తో ఫైట్: సర్పంచ్ లను ఎగదోస్తున్న బండి సంజయ్