Vijayawada News: విజయవాడలో సంచలనం రేపుతున్న బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అభం శుభం తెలియని బాలికను వంచించిన నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తాత వయసున్న వాడు ముక్కుపచ్చలారని బాలికను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై అందరిలో ఆగ్రహ జ్వాలలు వస్తున్నాయి. తమకు ఎక్స్ గ్రేషియా అక్కర్లేదని వాడి ప్రాణాలు కావాలని బాలిక తల్లి అనురాధ కన్నీటి పర్యంతమవుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురికి ఇంత గతి పడుతుందని ఏనాడు అనుకోలేదని రోదించింది. ఆమె రోదనలతో అందరు కంట నీరు పెట్టారు. ఆ తల్లికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
రాజకీయ పార్టీల అండతోనే ఇంత దారుణమైన ఘోరాలు జరుగుతున్నాయనే వాదన వస్తోంది. కంటికి రెప్పలా కాచుకున్న మా బాలికపై ఓ దుర్మార్గుడి కన్ను పడటంపై ఆందోళన కలుగుతోంది. కామపిశాచుల ఆట కట్టించాలని చెబుతున్నారు. అయితే తమతో రెండు రోజులుగా బాలిక వింతగా ప్రవర్తించినా తాము గుర్తించలేకపోయామన్నారు. ఐ మిస్ యూ మమ్మీ అంటూ పలు మార్లు రోదించిందని గుర్తు చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని కంట నీరు పెట్టుకున్నారు.
Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
సంచలనం రేపిన బాలిక ఆత్మహత్య ఉదంతంపై అందరిలో ఆగ్రహం పెరిగిపోతోంది. నగరం నడిబొడ్డున ఇంత దారుణానికి తెగించిన ఆగంతకుడికి తగిన బుద్ధిచెప్పాలని తల్లిదండ్రుల నుంచి నగర వాసుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. మహిళల కోసం చట్టాలు తెచ్చామని చెబుతున్నా సరే ఇంత దారుణమైన ఘటన చోటుచేసుకోవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారిపై ఇంత దారుణంగా ప్రవర్తించిన వాడిని కఠినంగా శిక్షించాల్సిందేనని అందరు చెబుతున్నారు.
అయితే తమకు ఎక్స్ గ్రేషియా వద్దని చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే తమ కూతురు శాంతిస్తుందని అన్నారు. ముక్కుపచ్చలారని బాలికల ఉసురు తీసే ఇలాంటి వారిని ఉపేక్షించకుండా కఠినమైన శిక్షలు వేసి మరో ఉదంతం జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు. సీఎం జగన్ ను కలిసి తమ కూతురుకు ఈ గతి పట్టించిన దుండగుడిని కఠినంగా శిక్షించి తమ కూతురు ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని కోరుతున్నారు.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?