https://oktelugu.com/

Akshay Kumar: షాకింగ్ నిజాల మధ్యన ‘రామ సేతు’ సాగుతుంది – అక్షయ్ కుమార్

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్టార్ హీరోల్లో ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే ఏకైక హీరో. ప్రస్తుతం ఈ హీరో అభిషేక్ శర్మ దర్శకత్వంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ‘రామ సేతు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జనవరి 31తో పూర్తియింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అక్షయ్ మాటల్లోనే.. ‘రామ సేతు’ పేరులోనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 1, 2022 / 05:07 PM IST
    Follow us on

    Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్టార్ హీరోల్లో ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే ఏకైక హీరో. ప్రస్తుతం ఈ హీరో అభిషేక్ శర్మ దర్శకత్వంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ‘రామ సేతు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జనవరి 31తో పూర్తియింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

    Akshay Kumar

    అక్షయ్ మాటల్లోనే.. ‘రామ సేతు’ పేరులోనే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలోని కొన్ని షాకింగ్ నిజాల మధ్యన నడవబోతున్న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడమంటే తనకు మరోసారి స్కూల్కు వెళ్లిట్లు అనిపించిందని అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. అలాగే అప్పటి రామసేతును వానరుల సహయంతో కట్టారని, ఈ ‘రామసేతు’ సినిమాను తమ బృందంతో కలిసి నిర్మించామని పేర్కొన్నాడు.

    Also Read: అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..

    తెలుగు హీరో సత్యదేవ్ కూడా ఈ సినిమాలో పురావస్తు శాస్త్రవేత్తలోనే కనిపించబోతున్నాడు. అక్షయ్‌ కుమార్‌ ఈ మధ్య ఎక్కువుగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న భామలతో జతకడుతూ వస్తున్నాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. అలాగే హోమ్లీ బ్యూటీ ప్రణీత సుభాష్ కు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.

    Akshay Kumar

    ఏది ఏమైనా మూవీ మిషన్ నుంచి రామ సేతు లాంటి డిఫరెంట్ సినిమా రాబోతుంది. అందుకే అక్షయ్ ను ఒక మినీ ఇండస్ట్రీ అంటుంటారు. లేకపోతే ‘రామసేతు’ లాంటి సినిమాను మరో హీరో ఇంత స్పీడ్ గా చేయలేడు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    Also Read: తండ్రి ఆస్తి విషయంలో అక్క‌పైనే పెట్రోల్ పోసిన చెల్లెలు.. ఇద్ద‌రు మంటల్లో

    Tags