https://oktelugu.com/

Rajamouli: తెలుగు తెరకు రెండు తేదీలు అలవాటు చేసిన రాజమౌళి !

Rajamouli: బాహుబలితో టాలీవుడ్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. దానిలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ, రాజమౌళి ఇప్పుడు తెలుగు చిత్రసీమకు మరో పద్దతి కూడా నేర్పించాడు. ఇంతకీ ఏమిటి ఆ పద్ధతి అంటే.. రిలీజ్ డేట్స్ వ్యవహారం. అసలు ఇంతకుముందు ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ఫలానా రోజున రిలీజ్ అవుతుంది అంటూ ఒక తేదీ ప్రకటించేవారు. ఒకవేళ ఫలానా తేదీ చెప్పలేని పక్షంలో ఫలానా సీజన్ అని చెప్పేవాళ్ళు. కానీ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 1, 2022 5:12 pm
    Follow us on

    Rajamouli: బాహుబలితో టాలీవుడ్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. దానిలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ, రాజమౌళి ఇప్పుడు తెలుగు చిత్రసీమకు మరో పద్దతి కూడా నేర్పించాడు. ఇంతకీ ఏమిటి ఆ పద్ధతి అంటే.. రిలీజ్ డేట్స్ వ్యవహారం. అసలు ఇంతకుముందు ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ఫలానా రోజున రిలీజ్ అవుతుంది అంటూ ఒక తేదీ ప్రకటించేవారు. ఒకవేళ ఫలానా తేదీ చెప్పలేని పక్షంలో ఫలానా సీజన్ అని చెప్పేవాళ్ళు.

    Rajamouli

    Rajamouli

    కానీ ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలు తమ చిన్నాచితకా సినిమాలకు కూడా రెండేసి రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ.. రాజమౌళిని ఫాలో అయిపోతున్నారు. అసలు వరుణ్ తేజ్ లాంటి చిన్న హీరో సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు అవసరమా ? వరుణ్ తేజ్ సినిమాకు ఓపెనింగ్స్ రావడం కష్టం. నాగబాబు వారసత్వం కాబట్టి.. వరుణ్ తేజ్ కి ఒక రేంజ్ అంటూ క్రియేట్ అవ్వలేదు. అలాంటి హీరో సినిమా ‘గని’కి రెండు తేదీల పై కర్చీఫ్ లు వేశారు.

    Also Read:  షాకింగ్ నిజాల మధ్యన ‘రామ సేతు’ సాగుతుంది – అక్షయ్ కుమార్

    ఈ రెండు తేదీల సంస్కృతిని తెలుగు తెరకు అలవాటు చేసిన రాజమౌళి కూడా ఇది ఊహించి ఉండడు. పెద్ద సినిమాలకు అంటే.. బోలెడు లెక్కలు ఉంటాయి. మరెన్నో లొసుగులు ఉంటాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి గతంలో రెండు విడుదల తేదీలు ప్రకటించాడు రాజమౌళి. చివరకు నిన్న ఆ రెండు తేదీలను కాదు అని, మరో తేదీకి సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.

    Rajamouli

    Rajamouli

    ఏది ఏమైనా ఒక సినిమాకు రెండు విడుదల తేదీల ఫార్మాట్ ను మాత్రం జక్కన్న బాగానే మేకర్స్ లోకి తీసుకువెళ్ళాడు. అయినా హిట్ కొట్టే విషయంలో రాజమౌళిని ఫాలో అవ్వలేని వాళ్ళు.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం రాజమౌళిని పక్కాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే భీమ్లానాయక్ మేకర్స్ తమ సినిమా కుదిరితే ఫిబ్రవరి 25, కుదరకపోతే ఏప్రిల్ 1న అంటూ రెండు విడుదల తేదీలు ప్రకటించారు.

    గని నిర్మాతలు కూడా వీలైతే ఫిబ్రవరి 25న, వీలు కాకపోతే మార్చి 4న అంటూ రెండు డేట్లు ఇచ్చారు. మొత్తానికి రిలీజ్ డేట్స్ లో కూడా మనోళ్లకు క్లారిటీ లేకపోవడం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న దౌర్భాగ్యం.

    Also Read:అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..

    Tags