https://oktelugu.com/

అదేంటో.. రఘునందన్‌రావు డబ్బులే దొరుకుతున్నయ్‌!

హోరాహోరీగా నడుస్తున్న దుబ్బాక బైపోల్‌ ప్రచారం నిన్నటితో ముగిసింది. ఇప్పటికే నేతలందరూ తమ ప్రచారంతో హోరెత్తించారు. గత ఆరేండ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలతో రెచ్చిపోయారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా అక్కడ ఉప ఎన్నిక పోలింగ్ జరుగబోతోందనేది స్పష్టమవుతోంది. Also Read: గ్రౌండ్ రిపోర్ట్: దుబ్బాక గెలుపెవరిదో..? ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సెంటర్‌‌ పాయింట్‌ అయ్యారు. అధికార పార్టీ ఆయనపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎన్నికల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 11:43 AM IST
    Follow us on


    హోరాహోరీగా నడుస్తున్న దుబ్బాక బైపోల్‌ ప్రచారం నిన్నటితో ముగిసింది. ఇప్పటికే నేతలందరూ తమ ప్రచారంతో హోరెత్తించారు. గత ఆరేండ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలతో రెచ్చిపోయారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా అక్కడ ఉప ఎన్నిక పోలింగ్ జరుగబోతోందనేది స్పష్టమవుతోంది.

    Also Read: గ్రౌండ్ రిపోర్ట్: దుబ్బాక గెలుపెవరిదో..?

    ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సెంటర్‌‌ పాయింట్‌ అయ్యారు. అధికార పార్టీ ఆయనపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎన్నికల కోసం ఆయనకు ఏ మాత్రం ఆర్థిక సహకారం లేకుండా చేసేందుకు యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుంటోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అర్థమవుతోంది. ఎన్నికల తేదీల ప్రకటన దగ్గర్నుంచి వరుసగా రఘునందన్‌ రావుకు సంబంధించిన డబ్బులే పట్టుబడుతున్నాయి. అందరూ.. ఎన్నికల్లో పంచేందుకు తీసుకెళ్తున్నామని ఒప్పుకుంటున్నారని.. పోలీసులు కూడా స్టేట్‌మెంట్‌లు రికార్డు చేస్తున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఎన్నిక ఇది. ఈ ఎన్నికల ప్రక్రియం ప్రారంభమైనప్పుడు మొదట్లో హైదరాబాద్‌ శివారులో రూ.40 లక్షల వరకూ పట్టుకున్నారు. దొరికిన వారు రఘునందన్ రావు ఆఫీసు సిబ్బంది. వారు ఎన్నికల్లో పంచడానికి తీసుకెళ్తున్నట్లుగా అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువు అంజన్ రావు ఇంట్లో కూడా నగదు పట్టుబడింది. అది పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. రఘునందన్ రావు బామ్మర్ది రూ.కోటి నగదును తీసుకెళ్తూండగా పోలీసులు పట్టుకున్నారు. అది కూడా ఎన్నికల్లో పంచడానికేనని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఎన్నికలంటే కోట్ల ఖర్చుతో కూడుకున్నవి.

    Also Read: టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ: రాష్ట్రంలో భీకర వాతావరణం

    అయితే.. ఇక్కడ వింత ఏంటంటే గత మూడు సందర్భాల్లోనూ రఘునందన్‌రావుకు సంబంధించిన డబ్బులే పట్టుబడ్డాయి. అంటే అధికార పార్టీ ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందా..? ఇప్పటికే దుబ్బాకలో అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకు ఒక్కో పార్టీ రూ.20, 30 కోట్ల వరకూ రెడీ చేసుకుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సహజంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ వేరు. యథేచ్ఛగా డబ్బులు తరలించినా ఎవరూ పట్టించుకోరు. పంచినా పట్టించుకోరు. ఆ అడ్వాంటేజీతో అధికార పార్టీవి ఒక్క రూపాయి కూడా వెలుగులోకి రావడం లేదని స్పష్టం అవుతోంది. విశేషం ఏమిటంటే టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేసినా ఒక్క రూపాయి కూడా దొరకలేదని పోలీసులే ప్రకటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతల్ని అసలు పట్టించుకోవడమే మానేశారు.
    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్