టాలీవుడ్లోని యంగ్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక త్వరగానే క్రేజీ హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే రష్మిక తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. ఆచితూచి సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
Also Read: అదిరేటి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అతడు మళ్లీ సేఫ్..
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్టు సాధించింది. దీంతోపాటు నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’లోనూ రష్మిక నటించింది. ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించడంతో ఆమెకు అగ్రహీరోల సరసన వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.
రష్మిక మందన్న తాజాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే కరోనా కారణంగా అగ్రహీరోలైన ప్రభాస్.. ఎన్టీఆర్.. రాంచరణ్ ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. వారంతా ఇప్పట్లో వేరే సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో రష్మిక అగ్రహీరోల సరసన చేసే ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
Also Read: ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !
అగ్రహీరోలతో ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఈ భామ స్టార్డమ్ కంటే పారితోషికంపై ఫోకస్ పెట్టింది. మిడిల్ రేంజ్ హీరోలతో నటించేందుకు భారీ పారితోషకం తీసుకుంటూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఈక్రమంలోనే శర్వానంద్ మూవీలో రష్మిక నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శర్వానంద్ నటించనున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా కోసం రష్మిక ఏకంగా రెండుకోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. కరోనా నేపథ్యంలో ఈ పారితోషికంలో 25లక్షలు డిస్కౌంట్ ఇచ్చి 1.75లక్షలు తీసుకోనుందని టాక్. ఇలా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ ప్రస్తుతం లేకపోవడంతో పారితోషికంపైనే రష్మిక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వ్రతం చెడ్డ ఫలితం దక్కించుకుంటున్న రష్మికను చూసి తోటి హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్