https://oktelugu.com/

అమెరికా ఎన్నికలకు కౌంట్‌డౌన్: మొగ్గు ఎవరికి?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ఓటింగ్‌ జరుగనుంది. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌లు సాగించిన ప్రచారం దేశంలో హీట్‌ పుట్టించాయి. క్లైమాక్స్‌ దశలో ఇద్దరు కూడా మాటలు తూటాలు పేల్చారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. Also Read: సర్వే: […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 11:57 AM IST
    Follow us on


    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ఓటింగ్‌ జరుగనుంది. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌లు సాగించిన ప్రచారం దేశంలో హీట్‌ పుట్టించాయి. క్లైమాక్స్‌ దశలో ఇద్దరు కూడా మాటలు తూటాలు పేల్చారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.

    Also Read: సర్వే: ట్రంప్‌కు వ్యతిరేక పవనాలే.. ఓడిపోతాడా?

    ఈ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలిచి మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చుంటానని ట్రంప్‌ ధీమాతో ఉన్నారు. డెమోక్రాట్లకు పట్టం కడితే అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. జో బైడెన్ కు అవకాశం ఇస్తే దేశంలో పన్నులు విపరీతంగా పెరుగుతాయని, అతను పెద్ద అవినీతిపరుడని, అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇంత చెత్త అభ్యర్థిని తానెప్పుడూ చూడలేదని పరుష పదజాలంతో బైడెన్ పై విరుచుకుపడ్డారు. అందుకే.. 2016లో కంటే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

    మరోవైపు డెమోక్రాట్ల నుంచి బరిలో దిగిన జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్‌పై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. గత నాలుగేళ్లలో అన్నిరంగాల్లోనూ దేశాన్ని డోనాల్డ్ ట్రంప్ నాశనం చేశారని, దేశంలో కరోనా కేసులు పెరగడానికి, ప్రపంచంలోనే అత్యధికంగా కరోనాతో అమెరికా దెబ్బతినడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ ఆరోపించారు. ట్రంప్‌ను గద్దె దించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అమెరికాను విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ మండిపడుతున్నారు.

    Also Read: నవ్వులపాలైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్

    వీరి ప్రచారం ఇలా ఉండగా.. ఇక సర్వేల విషయానికి వస్తే జో బైడెన్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి. ట్రంప్ కంటే జో బైడెన్ ప్రజారోగ్య సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారని అమెరికన్ ఓటర్లు చాలామంది విశ్వసిస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు ఓటర్లలో 65 శాతం ఉన్న శ్వేత జాతీయుల ఓట్లు తనకే పడతాయన్న ధీమాలో ట్రంప్ ఉన్నారు. ఏది ఏమైనా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనేది మరెంతో సమయం లేదనేది అందరికీ తెలిసిందే. రేపు జరుగనున్న ఓటింగ్‌ పైనే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆసక్తి నెలకొంది.
    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు