Chandrababu – NTR Centenary Celebrations : మరికొద్ది సేపట్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు హైదరాబాద్ లోని కుక్కట్ పల్లి సభ ముస్తాబైంది. శక పురుషుడి జయంతిని భారీ ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు. పూర్తిగా చంద్రబాబు లెక్క ప్రకారమే అతిథులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పక్కా పొలిటికల్ లెక్కతోనే ఇన్విటేషన్లు ఉన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిని విస్మరించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయ సమీకరణలతోనే వారిని దూరం పెట్టినట్టు టాక్ నడుస్తోంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వేదిక వద్దకు చేరుకుంటున్నారు. నందమూరి బాలయ్య, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వెంకటేష్ తో పాటుగా జయప్రద, గవర్నర్ బండారు దత్తాత్రేయ, దర్శక నిర్మాతలకు ప్రత్యేక ఇన్విటేషన్లు అందాయి ఈ రోజు తన జన్మదినం కారణంగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో తాను హాజరు కావటం లేదని తారక్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన శత జయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు రచ్చ చేశారు. ఇప్పుడు ఆహ్వానం అందినా జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదు.
అయితే ఇంత పెద్ద ఈవెంట్ కు ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న ముగ్గురికి ఆహ్వానం అందించలేదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబులు ఆహ్వాన జాబితాలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందుకే ఇది చంద్రబాబు సూచనల మేరకే ఆహ్వాన కమిటీ పనిచేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాన్ ను రాజకీయ మిత్రుడుగా ఆహ్వానించారు. అల్లు అర్జున్ ను సైతం ఆహ్వానించారు. వెంకేటేష్ ను ఆహ్వానించిన కమిటీ అక్కినేని వారసులను పిలవకపోవటం చర్చకు దారి తీస్తోంది. సినీ రంగంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మోహన్ బాబుకు సైతం ఆహ్వానించకపోవడం విస్తుగొల్పుతోంది. ఇటీవల చంద్రబాబుతో మోహన్ బాబు స్నేహం చిగురించింది. ఇటువంటి సమయంలో ఆహ్వానించకపోవడం ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Thats chandrababus work no invitations for those three
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com