Calcium Rich Foods: మన శరీరమే మొత్తం ఎముకల గూడు. ఎముకలు బలంగా లేకపోతే శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. ఎముకలు బలంగా ఉండాలంటే ఒంట్లో కాల్షియం తగినంత మోతాదులో ఉండాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎముకలు పటుత్వంగా లేకపోతే నాడీ వ్యవస్థ సరిగా ఉండదు. అందుకే ఎముకల బలానికి అందరు పాలు తీసుకుంటూ ఉంటారు కానీ పాలకంటే అధిక బలమైన కాల్షియం నువ్వుల్లో దొరుకుతుందనే విషయం చాలా మందికి తెలియదు.
చాలా మందికి నువ్వులు బెల్లం కలుపుకుని తినడం అలవాటు ఉంటుంది. ఇది మంచి అలవాటే. దీని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కాల్షియం బాగా అందుతుంది. ఫలితంగా ఎముకల బలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎముకలు బలంగా ఉంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో అన్ని పనులు సక్రమంగా చేసుకోవచ్చు. ఎముకలు దెబ్బతింటే ఇక మనం నిలబడటమే కష్టం.
చియా గింజల్లో కాల్షియం బాగుంటుంది. వంద గ్రాముల గింజల్లో 631 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పొద్దు తిరుగుడు గింజల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. బ్రోక్ లీలో కూడా కాల్సియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉండటంతో వీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇలా కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలంటే వీటిని తినడం మంచిది.
ఎముకల బలం పెరగాలంటే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఎముకల పటుత్వం కోసం మన ఆహారాలు మార్చుకోవాల్సిందే. మంచి బలమున్న ఆహారాలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. ఎముకల బలం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరు తగిన శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.