ATM Pin Number: ప్రస్తుతం బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. ఏదైనా ఏటీఎంకు వెళ్లి క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇలా కాదు బ్యాంకుకు వెళ్లి ఫామ్ నింపి లైన్ లో నిలబడి డబ్బులు డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్యలు పోయాయి. డబ్బులు కావాలంటే క్షణాల్లోనే మన చేతుల్లో డబ్బులు పడతాయి. అలా మనకు సౌకర్యాలు కల్పించబడ్డాయి. దీనికి ఏటీఎం కార్డు మనకు ఉపయోగపడుతుంది.
దీన్ని ఎవరు తయారు చేశారు?
ఏటీఎం మిసన్ ను మన భారతీయుడైన అడ్రియన్ షెపర్డ్ కనుగొన్నారు. ఆయన మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నగరంలో జన్మించాడు. ఏటీఎంను 1969 సంవత్సరంలో కనుగొన్నారు. మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో మొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు. ఏటీఎంను కనిపెట్టిన వాడు మనవాడే కావడం గమనార్హం.
పిన్ కు నాలుగు అంకెలే..
ఏటీఎం పిన్ నెంబర్ నాలుగు అంకెలే ఎందుకుంటాయి? మొదట్లో ఏటీఎం పిన్ నెంబర్ ఆరు అంకెలు ఉండేవి. దీంతో అవి గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండేది. కానీ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉండేది కాదట. దీంతో నాలుగు అంకెలకు కుదించారు. 0 నుంచి 10000 వరకు మధ్యలో ఉన్న అంకెలతో ఏదైనా పిన్ గా పెట్టుకోవచ్చు. ఆరు అంకెలప్పుడు మన నెంబర్ చోరీకి గురయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటోంది.
సౌకర్యవంతంగా..
ఏటీం మిషన్లు అందుబాటులోకి రావడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎలాంటి కష్టాలు ఉండటం లేదు. దీంతో సులువుగా డబ్బులు తీసుకుంటున్నాం. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే డబ్బులు బయటకు రావడంతో ఏటీఎంల ప్రాధాన్యం పెరిగింది. దేశంలో ప్రస్తుతం ఏటీఎం ద్వారానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎంలతో మనం ఎంత వరకైనా లావాదేవీలు చేసుకోవచ్చు.