Homeఎంటర్టైన్మెంట్Allu Sirish Wedding: ఎంత ఘాటు ప్రేమయో.. అల్లు శిరీష్ పెళ్లిలో సీఎం రేవంత్ ,...

Allu Sirish Wedding: ఎంత ఘాటు ప్రేమయో.. అల్లు శిరీష్ పెళ్లిలో సీఎం రేవంత్ , అల్లు అర్జున్ మధ్య ఆప్యాయత ఎలా ఉందో మీరే చూడండి!

Allu Sirish Wedding: 2024 డిసెంబర్ నెల ని అంత తేలికగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులు మర్చిపోలేరు. ‘పుష్ప 2 ‘ చిత్రం తో ఒక పక్క పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించి సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకెళ్తుంటే , మరోపక్క సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ కావాల్సి వచ్చింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ […]

Allu Sirish Wedding: 2024 డిసెంబర్ నెల ని అంత తేలికగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులు మర్చిపోలేరు. ‘పుష్ప 2 ‘ చిత్రం తో ఒక పక్క పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించి సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకెళ్తుంటే , మరోపక్క సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ కావాల్సి వచ్చింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంతటి సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. దానికి కౌంటర్ గా అప్పట్లో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా బాగా వైరల్ అయ్యింది. వీళ్ళ మధ్య ఈ రేంజ్ లో విబేధాలు ఏర్పడ్డాయి, ఇక జీవితంలో ఎప్పటికీ వీళ్ళు కలుసుకోరు , మాట్లాడుకోరు అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిశారు.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

అల్లు అర్జున్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ని ఎంతో ఆప్యాయంగా పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డు కి కూడా ఎంపిక చేశాడు. ఇది కాసేపు పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశాడు . ఆయన వచ్చిన విషయం తెలుసుకొని అల్లు అర్జున్, అల్లు బాబీ నేరుగా డోర్ దగ్గరకు వెళ్లి , ఆయన సాధారణంగా ఆహ్వానిస్తూ తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నిన్న పెళ్ళికి సంబంధించి దాదాపుగా ఎన్నో వీడియోలు వచ్చాయి. అల్లు అర్జున్ ఎవరినీ కూడా అంత ఆప్యాయంగా స్వాగతించలేదు, చివరికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఈ రేంజ్ లో ఆహ్వానించలేదు.

అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి ని ఇంత ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం వేరే లెవెల్ లో ఏర్పడిందని అనుకోవచ్చు. అలా కాకుండా రేవంత్ రెడ్డి సీఎం పదవికి గౌరవం ఇస్తూ అల్లు అర్జున్ ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ పై సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో తన జోలికి రాకూడదు అనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ ఇలా ఆయనకు దగ్గర అయ్యుండొచ్చని, అంతే తప్ప వీళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ లేదని అంటున్నారు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper