Homeఆంధ్రప్రదేశ్‌ఆ పార్టీల మతమంత్రానికి గట్టిషాక్..

ఆ పార్టీల మతమంత్రానికి గట్టిషాక్..

AP Politics
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఏదో ఒక విధమైన నిందారోపణలు చేస్తూనే వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా రకమైన వివాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేలా చేశాయి. ప్రధాన ప్రతిక్షం అయిన టీడీపీ పాత్ర ఇందులో కాస్త ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. దేవాలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేయడం… తరువాత వారే ఆందోళనకు దిగడం చాలా చర్యలకు ఇటీవల పెట్టింది పేరుగా టీడీపీ నేతలు నిలిచారు. వీరికి బీజేపీ, జనసేన పార్టీలు కూడా వంత పాడుతూ వచ్చాయి. మతరాజకీయాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నం చేశారు.

Also Read: చంద్రబాబు ఫెయిల్ అయ్యింది.. జగన్ పాస్ అయ్యింది ఇక్కడే?

ఒకానొక సమయంలో సీఎం జగన్ మతాన్ని ప్రస్తావిస్తూ.. క్రిస్టియానిటీని ఫాలో అయ్యే ముఖ్యమంత్రి ఉంటే.. హిందుత్వానికి ప్రమాదం వచ్చేసిదన్నంత రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు ఐదారు నెలలు అలాంటి వ్యూహాత్మక రాజకీయాలే కొనసాగుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ మత మంత్రాన్నే వినియోగించాలని టీడీపీ, బీజేపీ, జనసేన అనుకున్నాయి. ఎవరికివారే తాము హిందుత్వవాదులమన్నట్లు కాషాయ కలరింగు ఇచ్చుకున్నాయి. వందల ఆలయాలపై దాడులు అంటూ ప్రభుత్వ పాలనపై ఓ రేంజ్ లోనే విమర్శలకు దిగాయి ఆ మూడు పార్టీలు..

అయితే వీళ్లరంగు తెలియనివారు ఉండరు. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలనేది హిందూ రాజకీయ నేతలే అని గతంలో బాహాటంగా చెప్పేశారు పవన్ కల్యాణ్. క్రిస్టియన్, ముస్లిం నేతలు అలాంటి పనులు చేయరని.. కేవలం హిందూ రాజకీయ నేతలే మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొడతారని గతంలో వ్యాఖ్యానించారు. బహుశా.. తనమాటకు తానే కట్టుబడి ఇప్పుడు మత రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు కొందరు. ఇక చంద్రబాబు ట్రాక్ రికార్డు సరాసరే. తనను తాను నాస్తికుడినంటూ.. గతంలో ఓ పుస్తకంలో చెప్పుకుని.. అధికారంలో ఉన్నప్పుడు వందల గుళ్లను కూల్చేశారు ఆయన. బీజేపికి మత రాజకీయమే ఆయువుపట్టు. కేంద్రం నుంచి వచ్చేదేమీ. ఉండదు. ఇచ్చిన హామీలకే పంగనామాలు పెట్టి మళ్లీ రాజకీయం చేస్తేనే.. తమకు ఏపీలో అధికారం అందుతుందని లెక్కలేసుకున్నారు.

Also Read: హైదరాబాద్ యూటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇలా మతం అనే అజెండానే ఏపీలోని మూడు ప్రతిపక్ష పార్టీలు అందుకుంటున్నాయి. కానీ కామెడీ ఏమిటంటే.. ఆ అంశమేదీ.. పంచాయతీ ఎన్నికల్లో పనిచేయలేదు. ఒకటికాదు.. రెండు కాదు.. మూడు ప్రతిపక్ష పార్టీలూ.. మత రాజకీయమే చేసినా.. ఈ మతం అజెండా ఏదీ పంచాయతీ ఎన్నికల్లో వాటిని నాలుగు ఓట్లు తెచ్చి పెట్టలేదు. ఏపీ ప్రజలు తెలివైనవారు. మతం విషయంలో వారికి పూర్తి స్పష్టత ఉంది. పంచాయతీ ఎన్నికల ద్వారా ఏపీ ప్రజలు ఇస్తున్న స్పష్టమైన ఆదేశం ఏమిటంటే.. ప్రతిక్ష పార్టీలు కూడా తమ నడవడికను మార్చుకోవాలని.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version