‘జగపతి బాబు..’ శోభన్ బాబు లాంటి ఫ్యామిలీ హీరో.. ‘మైసమ్మ’ లాంటి క్రూరుడైన విలన్.. సినిమా బలాన్ని పెంచే అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అయితే ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు. కానీ.. తొలిరోజుల మాటేంటీ? ఆయన యాక్టింగ్ చూసి ఎలా స్పందించారు? ఆయన గొంతు విని ఏమన్నారు? అంటే.. తీవ్ర నిరాశకు గురిచేసే కామెంట్స్ చేశారట! ఈ విషయాలను స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే..
Also Read: ముంబైలో విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో కూతురితో రచ్చ!
అప్పటి సినీ నిర్మాత, ప్రముఖ దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు జగపతిబాబు. తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎంట్రీ ఈజీగానే అయినప్పటికీ.. ఆ తర్వాత అడుగులు మాత్రం అంత సాఫీగా సాగలేదు. వి.బి. రాజేంద్రప్రసాద్ కుమారుడు తొలిసారి కెమెరా ముందుకు వస్తున్నాడని తెలిసి చాలా మంది ప్రారంభానికి వచ్చారు. అందరూ చాలా గొప్ప యాక్టర్ అవుతాడని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా.. ‘పెద్ద హీరో ఇండస్ట్రీలోకి వస్తున్నాడు’ అని అనుకున్నారట.
కానీ.. ఆ తర్వాత చూస్తే మొత్తం తలకిందులైపోయింది. తొలి సినిమా విడుదలైన తర్వాత జగపతిబాబు యాక్టింగ్ పై పోస్టు మార్టం చేశారు సినీజనాలు. కొందరు వాయిస్ బాగలేదన్నారు.. మరి కొందరు మనిషే బాగలేడు అన్నారట. ఇంకొందరు రెండూ వేస్టే అన్నారట. పలువురు మాత్రం వాయిస్ ఓకే అన్నారట. ఇలా.. ఎవరికి వారు కామెంట్లు చేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడట జగపతిబాబు.
అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గిర్రున తిరిగింది. సీన్ కట్ చేస్తే.. జగపతిబాబు మోస్ట్ వాంటెడ్ ఫ్యామిలీ హీరోగా మారిపోయారు. కుటుంబ ప్రేక్షకులు మొత్తం ఆయనను ఓన్ చేసుకున్నారు. ఆయన కుటుంబ కథా చిత్రాలు చూస్తూ.. తమ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతోంది కదా.. అనుకుంటూ జగపతిబాబును తమవాడిని చేసుకున్నారు.
Also Read: అలియాకు రాజమౌళి స్పెషల్ ఆఫర్.. RRRలో సరికొత్త రోల్!
ఇందాకే చెప్పుకున్నాం కదా.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. మళ్లీ గిర్రున తిరిగింది. ప్రేక్షకుల అభిరుచి మారుతూ వచ్చింది. కుటుంబ కథా చిత్రాలు బోర్ కొడుతూ వచ్చాయి. దాంతో జగపతి బాబును కూడా మునుపటిలా రిసీవ్ చేసుకోవట్లేదు. కానీ.. ఏం చేస్తాడు? ఫ‌్యామిలీ హీరో చట్రంలో ఇరుసులా మారిపోయాడు. వేరే పాత్రలోకి మారడం కష్టంగా ఉంది. అంతకన్నా ముందు.. వేరే క్యారెక్టర్లోకి తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
అనుకున్నాం కదా.. కాలం గురించి! వన్ ఫైన్ డే.. ఓ ఫోన్ కాల్. ‘సర్.. మీరు మా సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలి.’ ఆలోచిస్తానన్నారు. ఆలోచించారు. మాసిన గడ్డంతో.. నెరిసిన జుట్టుతో.. లొకేషన్ కు వెళ్లారు. తర్వాత కెమెరా ముందుకు కూడా అలాగే వెళ్లారు. ఇప్పుడు ప్రతీ సినిమాలోనూ అలాగే కనిపిస్తున్నారు. జగపతి బాబు కాస్తా.. జగ్గూ భాయ్ అయ్యాడు! సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము లేపుతున్నాడు. జగ్గూ భాయ్ రోరింగ్ ఆన్ థియేటర్స్.. విత్ డీటీఎస్!
వందకు పైగా చిత్రాలు.. ఏడు నందులు అందుకున్న జగ్గూభాయ్.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. అంతేకాదు.. మోస్ట్ వాంటెడ్ నటుడు కూడా. ఫలితం గురించి ఆలోచించకుండా చేయాల్సింది చేస్తూ పోవడమే మన ఫిలాసఫీ అంటారు జగ్గూ. అదే చేశాడు.. చేస్తున్నాడు.. కాలం మళ్లీ గిర్రున తిరిగేంత వరకూ.. జగ్గూభాయ్ రోరింగ్ విల్ కంటిన్యూస్..
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్