ఊపులేని ఉక్కు ఉద్యమం..?

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు నినాదంతో నాడు జోరుగా సాగిన ఉద్యమం నేడు నీరు గారిపోతోంది. నాడు కలిసికట్టుగా నడిచిన ఉద్యమ కారులు సంస్థను సాధించుకోగా.. నేడు చేజారిపోతున్న సంస్థకోసం ఒక్కరు కూడా ముందుకు రాకపోవడోం యాధృశ్చికరం అనిపిస్తోంది. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరునాడు వినిపించిన గళం.. రెండు రోజులకే మూగ బోయింది. విశాఖ ఉక్కు మా హక్కు అనే నినాదం కనబడకుండా పోయింది. పట్టించుకోవలసిన పాలకులు.. దాన్ని పక్కన పెట్టేశారు. […]

Written By: Srinivas, Updated On : February 15, 2021 10:56 am
Follow us on


ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు నినాదంతో నాడు జోరుగా సాగిన ఉద్యమం నేడు నీరు గారిపోతోంది. నాడు కలిసికట్టుగా నడిచిన ఉద్యమ కారులు సంస్థను సాధించుకోగా.. నేడు చేజారిపోతున్న సంస్థకోసం ఒక్కరు కూడా ముందుకు రాకపోవడోం యాధృశ్చికరం అనిపిస్తోంది. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరునాడు వినిపించిన గళం.. రెండు రోజులకే మూగ బోయింది. విశాఖ ఉక్కు మా హక్కు అనే నినాదం కనబడకుండా పోయింది. పట్టించుకోవలసిన పాలకులు.. దాన్ని పక్కన పెట్టేశారు. ఉద్యమించాలని విపక్ష పార్టీలు ఊరికెనే చూస్తూ కుర్చుంటున్నాయి.

Also Read: చంద్రబాబు ఫెయిల్ అయ్యింది.. జగన్ పాస్ అయ్యింది ఇక్కడే?

అసలు విశాఖ ఉక్కు అంటేనే బలమైన పోరాటం గుర్తుకు వస్తుంది. నాడు మహనీయులు త్యాగాలు చేసిమరీ.. సాధించిన పరిశ్రమ అని తెలిస్తే… గర్వం కూడా పుడుతుంది. ఇప్పుడు ఆ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని వధ్యశిల మీద తల పెట్టేసింది. నేడో రేపో వేటు పడిపోతున్న సీన్ అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

అలాంటి అప్పుడు ఉద్యం అంటే ఎలా ఉండాలి. సునామీలా మారి ఢిల్లీ కోటమీద ఒక్కాసారిగా విరుచుకుపడాలి. కానీ విశాఖలో ఉద్యమం పేరిట జరుగుతున్న తతంగం చూస్తుంటే… అంతా చప్పచప్పగా సాగుతోంది. ఎక్కడికక్కడ లోకల్ గా యూనియన్లు.. సంఘాలు.. అసోసియేషన్లు రోడ్లపైకి వచ్చి విడివిడిగా కాసేపు నినాదాలు చేసిన మమ అనిపించేసి ఇంటిదారి పడుతున్నాయి.

వీరందరి చిత్తశుద్దిని ఇక్కడ ఎవరూ శంకించడం లేదు. కానీ… ఇలా ఒకే లక్ష్యంతో రోడ్లపైకి వచ్చే వీరంతా.. ఒక్కచోట కలిస్తే… అది పెద్ద ప్రజా సమూహంగా మారుతుంది. కొన్నివేల గొంతుకలు కలిస్తే.. బలమైన నినాదంగా మారుతుంది. కానీ అలాం అందరినీ ఏకం చేసే వేదిక కానీ… నాయకుడు కానీ.. కనిపించడం లేదు. ఫలితంగా ఈ సందర్భాన్ని మలిదశ ఉక్కు ఉద్యమ పోరాటానికి అసలైన విషాదంగా భావిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ యూటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

యాబై ఏళ్లనాటికీ.. నేటికీ.. ఇంత పెద్ద వ్యత్యాసం రావడానికి కారణం ఎవరి కుంపటి వారిది అన్నట్లుగా పరిస్థితి ఉండడమే, ఎవరి స్వార్థాలు వారివి అన్నట్లుగా ఉండడమే అంటున్నారు. మరీ ఇలా చప్పగా గొంతు పెగలని ఉక్కు ఉద్యమాన్ని చూసి మధ్య శిల మీద ఉన్న స్టీల్ ప్లాంటు మీద వేటు వేయకుండా ఢిల్లీ ప్రభువులు ఊరుకుంటారా… చూడాలి మరి ఇక ముందు అయినా ఉక్కు పోరు ఎలా జరుగుతుందో..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్