https://oktelugu.com/

కేసీఆర్‌‌ ఇమేజీని కాపాడేందుకే ఆ న్యూస్ చానల్‌ తాపత్రయం!

తెలుగు మీడియాలో అదో ప్రముఖ చానల్‌. దాని తీరు ఎప్పుడూ విభిన్నమే. ఓ ఎస్‌ఈసీని టార్గెట్‌ చేయాలన్నా.. తనకు నచ్చిన నాయకుడిని ఎవరెస్ట్‌ స్థాయిలో ఎత్తుకోవాలన్నా.. నచ్చని నాయకుడికి వ్యతిరేకంగా కథనాలు వడ్డించాలన్నా ఆ చానల్‌కు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాల్లోనూ ఓ వర్గానికే సపోర్టుగా నిలుస్తూ.. కథనాలను వడ్డిస్తుంటుంది. Also Read: చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలను బేస్‌ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కష్టం వచ్చిందని […]

Written By: , Updated On : November 15, 2020 / 12:37 PM IST
Follow us on

KCR

తెలుగు మీడియాలో అదో ప్రముఖ చానల్‌. దాని తీరు ఎప్పుడూ విభిన్నమే. ఓ ఎస్‌ఈసీని టార్గెట్‌ చేయాలన్నా.. తనకు నచ్చిన నాయకుడిని ఎవరెస్ట్‌ స్థాయిలో ఎత్తుకోవాలన్నా.. నచ్చని నాయకుడికి వ్యతిరేకంగా కథనాలు వడ్డించాలన్నా ఆ చానల్‌కు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాల్లోనూ ఓ వర్గానికే సపోర్టుగా నిలుస్తూ.. కథనాలను వడ్డిస్తుంటుంది.

Also Read: చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్

ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలను బేస్‌ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కష్టం వచ్చిందని తనదైన మార్క్‌ చూపిస్తూ కథనం రాసింది. ఓ వైపు రాష్ట్రమంతటా దీపావళి టపాసులు పేలుతుంటే.. ఈ చానల్‌లో మాత్రం అరగంట ఈ కథనం ప్రసారం చేసింది. కేసీఆర్‌‌ ఉద్యమ చరిత్రను చెబుతూ.. ఆయన నిబద్ధతను మరోసారి గుర్తుచేసే ప్రయత్నమే చేసింది. అంతిమంగా.. ఒక్క ఓటమితో ఆయన ప్రభ మసకబారదని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌‌ ఇమేజీని కాపాడేందుకే ఆ చానల్‌ ఆ కథనం రాసినట్లుగా దానిని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. ఎందుకంటే.. దుబ్బాక ఓటమితో కేసీఆర్ రాజకీయ ప్రభ తగ్గిపోయిందని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. ఆయన ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే ఓటర్లు ఈ షాక్‌ ఇచ్చారనేది వాస్తవం. కానీ.. ఆ చానల్‌ మాత్రం కేసీఆర్‌‌కు ఏదో భారీ షాక్ తగిలిందని.. ఆయనను తక్కువ చూడవద్దని కథనం వండి వార్చింది.

Also Read: పవన్ సంచలనం: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ!

కేసీఆర్ విషయంలో ఆ చానల్‌ ప్రసారం చేసిన అరగంట బాకాను పూర్తిగా చూసిన వారికి వ్యాపార ప్రయోజనాల కోసం ఇలా మీడియా చానళ్ల అధిపతులు ప్రత్యేకంగా కథనాలు రాయించుకోవడం సహజమే. కానీ అవి అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. టైమింగ్ మిస్సయితే తేడా కొడతాయి. తాజాగా ఈ చానల్‌ ప్రసారం చేసిన కథనం ఏదైనా ప్రతిఫలం ఇస్తుందో.. రియాక్షన్ ఇస్తుందో చూడాలి. అసలు ఆ స్టోరీని ఏ ఉద్దేశంతో రాయించారో కూడా తెలియకుండా ఉంది. సీఎం దృష్టిలో మరింత పాజిటివ్‌ మార్క్ తెచ్చుకునేందుకే ఆ చానల్‌ ఈ తతంగం నడిపినట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్