న్యూయార్క్ కు వ్యాక్సిన్ త్వరగా అందకపోవచ్చు: ట్రంప్

వచ్చే ఏడాదిలో అమెరికా ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుతుందని, అయితే న్యూయార్క్ ప్రజలకు మాత్రం అంత త్వరగా వ్యాక్సిన్ అందే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ  క్యూమోనే కారణమని ఆరోపించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకున్న అమెరికా ఔషధ సంస్థల సామర్థ్యంపై ఆండ్రూ క్యూమో భయపడుతున్నారని ట్రంప్ అన్నారు. అందుకే ఆ వ్యాక్సిన్ వెంటనే న్యూయార్క్ ప్రజలకు పంపిణీ చేయకుండా ఆయన పరిపాలన విభాగం అడ్డుకునే […]

Written By: Suresh, Updated On : November 15, 2020 12:45 pm
Follow us on

వచ్చే ఏడాదిలో అమెరికా ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుతుందని, అయితే న్యూయార్క్ ప్రజలకు మాత్రం అంత త్వరగా వ్యాక్సిన్ అందే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ  క్యూమోనే కారణమని ఆరోపించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకున్న అమెరికా ఔషధ సంస్థల సామర్థ్యంపై ఆండ్రూ క్యూమో భయపడుతున్నారని ట్రంప్ అన్నారు. అందుకే ఆ వ్యాక్సిన్ వెంటనే న్యూయార్క్ ప్రజలకు పంపిణీ చేయకుండా ఆయన పరిపాలన విభాగం అడ్డుకునే అవకాశం ఉందన్నారు. ఈవిషయంలో తాము ఎంతగానో చింతిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.