https://oktelugu.com/

ఏపీ దీపావళి వేడుకల్లో విషాదం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దీపావళి వేడుకలు కొన్ని చోట్ల విషాదంగా మారాయి. కృష్ణ జిల్లాలోని బాపులపాడు మండలం వీరవల్లిలో బాణసంచా కాలుస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్ కు చెందిన రాజేశ్, రంజీత్ లు శనివారం రాత్రి వీరవల్లిలో దీపావళి పటాకలు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో రాజేశ్ కుమార్, రంజిత్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నూజివీడు ఆసుపత్రికి తరలించే లోపే రాజేశ్ కుమార్ మృతి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 15, 2020 12:36 pm
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దీపావళి వేడుకలు కొన్ని చోట్ల విషాదంగా మారాయి. కృష్ణ జిల్లాలోని బాపులపాడు మండలం వీరవల్లిలో బాణసంచా కాలుస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్ కు చెందిన రాజేశ్, రంజీత్ లు శనివారం రాత్రి వీరవల్లిలో దీపావళి పటాకలు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో రాజేశ్ కుమార్, రంజిత్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నూజివీడు ఆసుపత్రికి తరలించే లోపే రాజేశ్ కుమార్ మృతి చెందాడు. రంజిత్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీనర్సాపురంలో కోళ్ల ఫాం లో అగ్నిప్రమాదంలో జరగగా సుమారు 1200 కోళ్లు మృతి చెందినట్లు సమాచారం.