BRS MLA Candidates : 2018లో బొడిగే శోభ.. 2023లో రేఖా నాయక్.. బలైంది ఇద్దరూ మహిళలే

తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ సూచన మేరకే సీఎం కేసీఆర్‌ రేఖానాయక్‌ను తప్పించినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : August 21, 2023 6:56 pm
Follow us on

BRS MLA Candidates : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరుసగా రెండో ఏడాది కూడా ఓ సిట్టింగ్‌ మహిళను బలి పశువును చేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్‌ నిరాకరించాడు. 106 మందితో ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరు లేకుండా సుంకె రవిశంకర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. తాజాగా ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేకానాయక్‌ను బలి చేశారు. తాజాగా ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌ను పక్కన పెట్టారు. ఆమె స్థానంలో జాన్సన్‌ నాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

నాడు ఎస్సీ మహిళ.. నేడు ఎసీ‍్ట మహిళ..
వరుసగా రెండు ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పక్కన పెట్టడం ఒకటి అయితే.. అందులో ఇద్దరూ వెనుక బడిన సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. బొడిగె శోభ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ. తాజాగా కేసీఆర్‌ తప్పించిన మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఎస్టీ మహిళ. మహిళలకు టికెట్‌ ఇవ్వడమే బీఆర్‌ఎస్‌లో కష్టం. అలాంటిది వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఒక్కో సిట్టింగ్‌ మహిళా ఎమె‍్మల్యేలను తప్పించారు.

సెంటిమెంటా.. కావాలనేనా..
మహిళా అభ్యర్థులను బలి చేయడం సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌ అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో కూడా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ వచి‍్చంది. కానీ కేసీఆర్‌ ఆమెకు టికెట్‌ ఇవ్వకుండానే బలి చేశాడు. ఇక 2018లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభను తప్పించారు. తాజాగా మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేకానాయక్‌కు చెక్‌ పెట్టారు. సిట్టింగ్‌ మహిళా అభ్యుర‍్థలను తప్పించిన స్థానాలో‍్ల మరో మహిళకు కూడా టికెట్‌ ఇవ్వకపోవడం గమనార్హం. నాడు చొప్పదండిలో రవిశంకర్‌కు టికెట్‌ ఇవ్వగా, తాజాగా జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ ఇచ్చారు.

కేటీఆర్‌ క్లాస్‌మేట్‌..
తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ సూచన మేరకే సీఎం కేసీఆర్‌ రేఖానాయక్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. జాన్సన్‌ నాయక్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు క్లాస్‌మేట్‌ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సూచన మేరకే రేఖానాయక్‌ స్థానంలో ఖానాపూర్‌ టికెట్‌ జాన్సన్‌నాయక్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.