MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఆరు స్థానాలకు గాను ఐదు జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్ లో రెండు స్థానాలు ఉండగా మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. అయితే అంతటా ప్రశాంతంగా ఎన్నికలు సాగినా ఖమ్మంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో అధికార పార్టీ తీరుపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు చేశారు.

దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. పోలింగ్ సరళిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని వాపోయారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేసి అధికార పార్టీ తీరును విమర్శించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒడిదుడుకుల మధ్య ప్రశాంతంగా సాగినా ఖమ్మంలో మాత్రం గొడవ జరగడం తెలిసిందే.
ఖమ్మంలో జరిగిన పోలింగ్ లో రాష్ర్ట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సుమారు మూడు గంటల పాటు పోలింగ్ కేంద్రంలోనే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలకడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ర్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: TTD Workers: టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలిస్తే అంతేనా?
అయితే అధికార పార్టీ ఇలాంటి చర్యలకు దిగడంతో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడటంపై ఆక్షేపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులకు ఏం పని అని ప్రశ్నించింది. దీనిపై తమ నిరసన వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ అడ్డదారుల్లో గెలిచేందుకే నిర్ణయించుకుందని చెబుతోంది.
Also Read: CID Attacks: టార్గెట్ చంద్రబాబు.. ఆయన మాజీ పీఎస్, ఐఏఎస్ ను వదలని సీఐడీ