Bipin Rawat: డ్రాగన్ కుయుక్తులు మారడం లేదు. కష్టకాలంలో కూడా ఓదార్పు మాటలకు బదులు ఎత్తిపొడుపు మాటలతో తన కుట్రలను బహిర్గతం చేస్తోంది. బారత సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకుని భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటస్తుంటే చైనా మాత్రం భారత్ పై విమర్శలకు దిగడం దాని వక్రబుద్ధికి దర్పణం పడుతోంది. ఈ నేపథ్యంలో చైనా మాటలను భారత్ తప్పుపడుతోంది. వీలైతే సంతాపం తెలపాలి కాని విమర్శలు చేయడంలో దాని ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తోంది.

చైనా, పాకిస్తాన్ కు సవాలు చేసిన బిపిన్ రావత్ మరణం తీరని లోటు. పాకిస్తాన్ లో సర్జికల్ స్ర్టయిక్ చేపట్టి దాని వెన్నులో వణుకు పుట్టించిన రావత్ మృతిపై అందరు సానుభూతి వ్యక్తం చేశారు. భారత సైనికుల్లో మనోబలం నింపుతూ వారిని ఎల్లప్పుడు సంసిద్ధం చేసే రావత్ కృషి మరువలేనిది. మరోవైపు డ్రాగన్ కు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిన బిపిన్ రావత్ వల్లే అది నియంత్రణలో ఉందని తెలుస్తోంది.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ భారతీయులలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెలికాప్టర్ భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవని తెలుస్తోంది. సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణాలని సమాచారం. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉండగా చైనా ఓదార్చకుండా వెటకారంగా మాట్లాడటంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టే రావత్ మరణంతో అందరిలో ఆందోళన నెలకొంది.
డ్రాగన్ మీడియాలు పిచ్చిరాతలు రాస్తూ కారుకూతలు కూస్తోంది. ఇండియా క్రమశిక్షణను ప్రశ్నించడం అవసరమా? దానికెందుకు మన గురించి? మనకున్న శక్తితోనే మనం అన్నింటిని సమకూర్చుకుంటున్నాం. మనకేమైనా సాయం చేస్తుందా? మన ఉనికిని ప్రశ్నించడానికి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చైనా కుట్రలను అందరు గర్హిస్తున్నారు. చైనా అదుపులో ఉండకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: General Bipin Rawat: వీర జవాన్ బిపిన్ రావత్‌కు సంబంధించిన ఈ గొప్ప విషయాలు మీకు తెలుసా?
డ్రాగన్ పిచ్చి రాతలను అక్కడి మీడియా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దురదృష్ట వశాత్తు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేయాల్సి ఉన్నా మన విధానాలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: CID Attacks: టార్గెట్ చంద్రబాబు.. ఆయన మాజీ పీఎస్, ఐఏఎస్ ను వదలని సీఐడీ