అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ముందస్తు ఓటింగ్ చురుగ్గా సాగుతోంది. కరోనా నేపథ్యంలో గూమిగూడుతూ ఓటెయ్యడం కంటే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించడం బెటరని చాలామంది భావించారు. దీంతో ముందస్తు ఓటెయ్యడానికి ముందుకు వస్తున్నారు. మంగళవారం నాటి 10.6 మిలియన్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా ఓటు పంపించారు. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 1.4 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా ప్రస్తుతం 10 రేట్లు ఈ ఓటింగ్‌లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: రైతులకు శుభవార్త.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 3000 మీ సొంతం!
అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బైడెన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ప్రజలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ముందస్తు ఓటింగ్‌లో బైడెన్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ముందస్తు ఓటింగ్‌లో డెమొక్రాటిక్ పార్టీనే ముందంజ ఉందని అమెరికా ఎన్నికల ప్రాజెక్టు అధికారి ప్రొఫెసర్ మైకెల్ మెక్ డోనాల్డ్ తెలిపారు. ఇప్పటి వరకు 4.6 మిలియన్ల మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేయగా ఇందులో 2.6 మిలియన్ల ఓట్లు డెమొక్రాట్లకే పోలైనట్లు చెప్పారు.
ఓటింగ్ గ్రాఫ్‌పై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈమెయిల్ ద్వారా ఓటర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని వాదిస్తున్నారు. ఇప్పటి వరకు పోలైన ఈమెయిల్ బ్యాలెట్ ఓట్లలో డెమొక్రాటిక్ పార్టీ ముందంజలో ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఎంత పని చేసింది కరోనా.. కవితకు గెలిచిన సంబురం లేకపాయె!
అయితే వీటిని కొలమానంగా తీసుకోలేమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అమెరికా వ్యాప్తగా 46 మిలియన్ల మెయిల్ బ్యాలెట్స్ ఇంకా అందాల్సి ఉందని, వాళ్లు కూడా ముందస్తు ఓటింగ్‌ను ఎంచుకునే సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు.