ఎంత పని చేసింది కరోనా.. కవితకు గెలిచిన సంబురం లేకపాయె!

ఆహా.. కరోనా ఎంత పని చేస్తివే.. 2020లో నువ్వు చేయలేనిది ఏదైనా ఉందా.. ప్రపంచాన్ని స్విచ్ఛ్ ఆఫ్ చేసిన ఘనత నీదే కదా.. కోట్లాది జనాలను ఇంట్లో కూర్చొబెట్టిన తెగువ నీదే కదా.. మూతికి మాస్క్ లేకుండా బయటకు వస్తే చస్తాం బాబోయ్ అనేలా చేసింది నువ్వే కదా.. చేతులు కడుక్కోండి మొర్రో రోగాలు రావు.. అని ఏండ్ల తరబడిగా ప్రభుత్వాలు చెప్పినా  వినిపించుకోని జనాలకు పాకెట్ శానిటైజర్ల సంస్కృతి నేర్పింది నీవే కదా…నీ కథలు ఎన్నో […]

Written By: NARESH, Updated On : October 14, 2020 11:49 am
Follow us on

ఆహా.. కరోనా ఎంత పని చేస్తివే.. 2020లో నువ్వు చేయలేనిది ఏదైనా ఉందా.. ప్రపంచాన్ని స్విచ్ఛ్ ఆఫ్ చేసిన ఘనత నీదే కదా.. కోట్లాది జనాలను ఇంట్లో కూర్చొబెట్టిన తెగువ నీదే కదా.. మూతికి మాస్క్ లేకుండా బయటకు వస్తే చస్తాం బాబోయ్ అనేలా చేసింది నువ్వే కదా.. చేతులు కడుక్కోండి మొర్రో రోగాలు రావు.. అని ఏండ్ల తరబడిగా ప్రభుత్వాలు చెప్పినా  వినిపించుకోని జనాలకు పాకెట్ శానిటైజర్ల సంస్కృతి నేర్పింది నీవే కదా…నీ కథలు ఎన్నో కదా.. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా.. కలియుగానికి మోస్ట్ పాపులర్ వైరస్ నువ్వే పో!.. చెప్పొచ్చేది ఏమిటంటే కరోనా మహాతల్లి గెలుపు సంబురాలను కూడా మనస్ఫూర్తిగా చేసుకోనివ్వకుండా చేసిన ఘనత సొంతం చేసుకుంది..

Also Read: రైతులకు శుభవార్త.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 3000 మీ సొంతం!

అవి.. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు.. కవితక్క గెలుపుపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.. గన్షాట్ విన్ అనుకున్నారు అంతా.. కాని సీన్ రివర్స్ అయింది.. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లు రాయించి ఇచ్చినా బీజేపీ అభ్యర్థి ఆర్వింద్ గెలిచాడు… అంతా షాక్.. కవితక్క ఓడిపోవడమేమిటి.. ఇది కలా నిజమా.. తేరుకోలేకపోయాయి టీఆర్ఎస్ శ్రేణులు.. అప్పటిదాక రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నా కవిత సైలెంట్ అయిపోయారు. ఏమి చేసేది లేదు.. ఎవరి టైం ఎట్లుందోనని క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.

సంవత్సరంన్నర తర్వాత.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత..ఎలక్షన్లకు ఆరు నెలల ముందు నుంచే టీఆర్ఎస్ వ్యూహాలు పన్నింది.. బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గులాబీ పార్టీలోకి చేర్చుకుంది.. మొత్తానికి 90శాతం ఓట్లతో కవిత తిరుగులేని విజయం సాధించారు. అపొజిషన్ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కలేదు.. గులాబీ శ్రేణుల సంబురాలకు అంతులేదు.. ఏముంది ఇంకా కరోనా కాలం అని కూడా చూడకుండా కవితకు కంగ్రాట్స్ చెప్పడానికి కార్యకర్తలు, లీడర్లు ఎగబడ్డారు. సీఎం కుమార్తె కావడంతో అభినందనలు చెప్పడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇప్పుడదే కొంపముంచింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్..

Also Read: భారీ వర్షం.. రైతులకు తీరని నష్టం.. పంటనష్టం ఎంతంటే..?

గెలుపు సంబురాల్లో పాల్గొన్న వారిలో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  పాజిటివ్ గా తేలింది. ఇటీవల ఆయన ఓ వేడుకకు హాజరయ్యారని అక్కడే సోకి ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందుస్తుగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్న సంజయ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించి హైదరాబాద్లోని తన ఇంటిలో ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. ఇక కవిత కూడా 5 రోజుల పాటు హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఆఫీసర్లు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులను ఆమె కలవడం లేదు.  మొత్తానికి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న కవిత గెలుపు సంబరాలకు దూరమవ్వడం కరోనా చలువే పాపం.