https://oktelugu.com/

ఆ హీరోయిన్లకు ‘బ్రేకప్’..ఇలా కలిసొచ్చిందా?

  ఆడైనా.. మొగైనా ఓ వయస్సుకొచ్చాక ప్రేమ.. పెళ్లి తప్పదు.. కొందరి జీవితంలో ప్రేమ.. పెళ్లిళ్లు సాఫీగా సాగుతుండగా మరికొందరికీ అవే శాపాలుగా మారుతున్నాయి. ఈ విషయంలో రాజు.. భంటు అనే తేడా లేదు. అందరు నిమిత్త మాత్రులే..! ఇక సినిమా పరిశ్రమ విషయానికొస్తే ఇదో మాయలోకం.. హీరోహీరోయిన్లు.. నటీనటులది ప్రత్యేక లైఫ్ స్టైల్. అయితే అందరిలాగే వారికి కూడా ప్రేమ.. పెళ్లి.. బాధలు తప్పడం లేదు. సినీ పరిశ్రమ గ్లామర్ చుట్టూనే తిరుగుతూనే ఉంటుందని ప్రత్యేకంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 10:57 AM IST
    Follow us on

     

    ఆడైనా.. మొగైనా ఓ వయస్సుకొచ్చాక ప్రేమ.. పెళ్లి తప్పదు.. కొందరి జీవితంలో ప్రేమ.. పెళ్లిళ్లు సాఫీగా సాగుతుండగా మరికొందరికీ అవే శాపాలుగా మారుతున్నాయి. ఈ విషయంలో రాజు.. భంటు అనే తేడా లేదు. అందరు నిమిత్త మాత్రులే..!

    ఇక సినిమా పరిశ్రమ విషయానికొస్తే ఇదో మాయలోకం.. హీరోహీరోయిన్లు.. నటీనటులది ప్రత్యేక లైఫ్ స్టైల్. అయితే అందరిలాగే వారికి కూడా ప్రేమ.. పెళ్లి.. బాధలు తప్పడం లేదు. సినీ పరిశ్రమ గ్లామర్ చుట్టూనే తిరుగుతూనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం.. అభినయం ఉండే హీరోయిన్లకు అవకాశాలకు చిత్రసీమలో కొదవ ఉండదు.

    Also Read: ‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ?

    బెల్లం చుట్టూ ఈగల్లా గ్లామర్ ఉండే హీరోయిన్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక వారి క్రేజ్ తగ్గుతున్న క్రమంలో హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యేందుకు చూస్తుంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ప్రేమ.. పెళ్లికి సై అంటున్నారు. మరికొందరు ప్రేమ.. పెళ్లిళ్లకు బ్రేకప్ చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

    ప్రేమ.. పెళ్లికి బ్రేకప్ చెప్పిన హీరోయిన్లే ఇప్పుడు చిత్రసీమలో మంచి అవకాశాలు దక్కించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. వీరిలో సౌత్ క్వీన్ నయనతార అందరి కంటే ముందుంది. ఇప్పటికే ఆమె మూడుసార్లు ప్రేమలో పడింది. రెండుసార్లు పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఈ వ్యవహారాల తర్వాతే నయన్ సినీ కెరీర్ టాప్ గేర్‌లో దూసుకుపోతుంది.

    Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్

    అమలాపాల్ కెరీర్ పీక్ స్టేజులో ఉన్నప్పుడే ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది కాలంలోనే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ జెడ్ స్పీడుతో దూసుకెళుతుంది. ఇక శృతి హాసన్..రష్మిక మందన్న.. ఆండ్రియాల ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ అయ్యాకే కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఈ ముద్దుగుమ్మల కెరీర్ కు ప్రేమ.. పెళ్లి బ్రేకప్ లు బూస్ట్ ఇవ్వడంతో వాళ్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.