Javed Akhtar: చెట్ల కింద నిద్ర.. ఆకలి కేకలు.. జావేద్ అక్తర్ జీవితంలో భయంకర పరిస్థితులు

జావేద్ అక్తర్ పేరు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ముంబై వీధుల్లో రోజుల తరబడి జీవన పోరాటం చేసి జీవనం సాగించాడు. 1945లో గ్వాలియర్ లో జన్మించిన జావేద్ తండ్రి నిసార్ అక్తర్ ప్రముఖ కవి.

Written By: Swathi, Updated On : January 25, 2024 3:44 pm

Javed Akhtar

Follow us on

Javed Akhtar: ఎవరి జీవితం పూల పాన్పులతో నిండి ఉండదు. ఎన్నో కష్టాలను అనుభవించి వస్తే గానీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు. అందులో చిత్ర పరిశ్రమలో ఉండే కష్టాలు వేరు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశం ఉంటేనే చేతిలో డబ్బులు ఉంటాయి. లేదా ఇండస్ట్రీలో ఉండడం కూడా కష్టమే అవుతుంది. కానీ నటీనటులు జీవితాలే కాదు రైటర్, డైరెక్టర్, నిర్మాత ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలానే ఉంటుంది. కొత్తగా అడుగుపెట్టాలి అంటే అవకాశం దొరకడం కూడా కష్టమే. ఎంతో మంది తిండి లేక రోడ్డు మీద ఉంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ గేటు దగ్గర వేచి ఉన్న వారి జీవిత చరిత్రలు విదితమే. ఒక్కోరిది ఒక రకమైన జర్నీ ఉంటుంది. అందులో రచయిత, స్క్రిప్ట్ రైటర్ జావేద్అక్తర్ ఒకరు…

జావేద్ అక్తర్ పేరు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ముంబై వీధుల్లో రోజుల తరబడి జీవన పోరాటం చేసి జీవనం సాగించాడు. 1945లో గ్వాలియర్ లో జన్మించిన జావేద్ తండ్రి నిసార్ అక్తర్ ప్రముఖ కవి. ఉర్దూ రచయిత్రి తల్లి సఫియా. ప్రొఫెసర్ కూడా. అతని తాత ఖైరాబాదీ కూడా ప్రముఖ కవి. ఈ జావిద్ అక్తర్ సాహిత్య కుటుంబంలో జన్మించారు. ఇతని పేరును కూడా తండ్రి రాసిన లమ్హా లమ్హా కిసీ జాదూ కా ఫసాపా హోగా అనే పద్యంలోంచి తీసుకున్నారు.

అయితే జాదు అనే పదానికి దగ్గరగా ఉన్నందున అతన్ని జావేద్ అని పిలుస్తారు. 1964లో జావేద్ అక్తర్ కలల నగరమైన ముంబై చేరుకున్నాడు. ఇక్కడ అతను చాలా సమయం అలుపెరుగని జీవిత పోరాటం చేశాడనే చెప్పాలి. మొదట్లో అతనికి ఇల్లు, వాకిలి, ఆకలి ఏవి లేవు. తినేతందుకు తిండి లేదు. ఆకలితో అలమటించి ఆకలినే మరిచిపోయాడు. చాలా రాత్రులు చెట్ల కింద నిద్రించాడు జావేద్. ఎన్నో రోజులు ఆకలితో ఉండి చివరికి జోగేశ్వరిలోని కమల్ అమ్రోహి స్టూడియోలో ఆశ్రమం పొందాడు. సలీమ్ తో హిట్ పెయిర్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తో అక్తర్ చాలా కాలం పని చేశాడు. ఒకప్పుడు సలీం-జావేద్ ల కాంబినేషన్ హిట్. సలీ-జావేద్ 1971-1987 వరకు 24చిత్రాలకు పనిచేశారు. వాటిలో 20 వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. వారి అనుబంధం 1982 వరకు కొనసాగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

షబానా, అజ్మీ రెండో భార్య హనీ ఇరానీ. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నటుడు, నిర్మాత, దర్శకులుగా పేరు గాంచారు. ఒకరు ఫర్హాన్ అక్తర్, మరొకరు జోయా అక్తర్. జావేద్ మొదటి భార్య హనీ ఇరానీని సీతా ఔర్ గీతా సెట్స్ లో కలిశాడు. అయితే ఆ తర్వాత అభిప్రాయ బేధాల వల్ల వారు విడిపోయారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు జావేద్ అక్తర్. ఎనిమిది సార్లు ఉత్తమ గీత రచయితగా ఎన్నికయ్యారు. ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు జావేద్. 1999లో పద్మశ్రీ, 2007లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. 2013లో అతను తన కవితా సంకలనం లవ కోసం ఉర్దూలో సాహిత్య అకాడమీ అవార్డును సైతం కైవసం చేసుకున్నారు. ఇది భారతదేశానికి చెందిన రెండవ అత్యున్నత సాహిత్య గౌరవంగా చెబుతారు.