ఆంధ్రప్రదేశ్‌ఏపీలో పట్టణాల్లోనూ అసైన్డ్ ల్యాండ్స్‌కే టెండర్..!

ఏపీలో పట్టణాల్లోనూ అసైన్డ్ ల్యాండ్స్‌కే టెండర్..!

CM Jagan
తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రామిస్‌ చేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక జగన్‌ ఇళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ స్కీమ్‌ పూర్తికావచ్చింది. కొండ కోనల్లోనో.. మారుమూల ప్రాంతాల్లోనో ఎక్కడైనా సరే. .గతంలో దళితులు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ అయినా తీసుకుని మరీ పేదలకు ఒక్కో సెంట్ చొప్పున పంపిణీ పత్రాలు ఇచ్చేసింది. కానీ.. ఇంకా ఇళ్లు కట్టాల్సిన టాస్క్ మిగిలి ఉంది. ఇప్పుడు మధ్యతరగతి వారికి ఇంటి యోగం కల్పించడానికి ఏపీ సర్కార్ సిద్ధమయింది.

లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏర్పాట్లు అంటే.. భూసేకరణ అన్నమాట. ఒక్కో పట్టణంలో వంద నుంచి నూట యాభై ఎకరాలు సేకరించాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పేదలకు ఇళ్లివ్వడానికి చేసిన భూసేకరణ అనేకానేక ఆరోపణలకు కారణమైంది.

కొన్ని వేల మంది అసైన్డ్ రైతుల కడుపు కొట్టింది. ఇప్పుడు పట్టణాల్లో భూసేకరణ ఎలా అనేది ప్రభుత్వ అధికారుల ముందు ఉన్న అతి పెద్ద సవాల్. ఎందుకంటే.. పట్టణాల్లో భూసేకరణ అంటే మామూలు విషయం కాదు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం తడిసిమోపెడవుతుంది. అంటే.. తక్కువలో భూసేకరణ జరగాలంటే అసైన్డ్ ల్యాండ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దశాబ్దాల క్రితం ఊరి శివార్లు అని.. చాలా మంది అసైన్డ్ ల్యాండ్స్ కేటాయించారు.

ఇప్పుడు అవి ఊరి దగ్గరకు వచ్చి ఉంటాయి. వాటిని తీసుకుని డెలవప్ చేసి ఆ అసైన్డ్ ల్యాండ్ ఓనర్లకు కొంత ఇచ్చి.. మిగతా మొత్తం మధ్యతరగతి వారికి విక్రయిస్తే ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగులుతాయన్న అంచనాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలే ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్‌పై వివాదాలు నడుస్తున్నాయి. చంద్రబాబుపై కేసు పెట్టడానికి అదే అసైన్డ్ ల్యాండ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సమయంలో అదే ఫార్ములా ప్రయోగించి.. పట్టణాల్లో భూసేకరణ చేస్తారా అన్నది కూడా సందేహంగా మారింది. మొత్తానికి ఇప్పుడు పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలివ్వాలంటే పెద్ద ఎత్తున భూములు సమీకరించారు. చట్ట ప్రకారం.. పరిహారం ఇచ్చి పరిహారం తీసుకుంటే సమస్య ఉండదు. కానీ.. అధికారంతో బెదిరించి.. అసైన్డ్ ల్యాండ్స్ తీసుకుంటే మాత్రం దళితులు తిరగబడే ప్రమాదాలూ లేకపోలేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Sitaram : తమ్మినేని సీతారాం నకిలీ పత్రాల ముఠాతో జట్టు.. భూకబ్జా కేసులో వెలుగులోకి దారుణ నిజాలు..

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారు. చాపురం పంచాయతీ లోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version