https://oktelugu.com/

కిడ్నాప్ చేసినా అఖిలప్రియకు కోట్ల ఆస్తి రాలేదే?

హఫీజ్‌పేట కిడ్నాపింగ్‌ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఈ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ ప్రమేయం ఉండడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. హఫీజ్‌పేటలోని 50 ఎకరాల భూములకు సంబంధించిన వివాదంలో హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది. వారితో బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నాలు సాగించినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. చివరకు ఆ కిడ్నాప్‌ డ్రామా ఫెయిల్‌ కావడంతో వారి ప్లాన్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 31, 2021 / 12:58 PM IST
    Follow us on


    హఫీజ్‌పేట కిడ్నాపింగ్‌ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఈ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ ప్రమేయం ఉండడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. హఫీజ్‌పేటలోని 50 ఎకరాల భూములకు సంబంధించిన వివాదంలో హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది. వారితో బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నాలు సాగించినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. చివరకు ఆ కిడ్నాప్‌ డ్రామా ఫెయిల్‌ కావడంతో వారి ప్లాన్‌ అంతా వృథా అయింది.

    చివరకు ఈ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఆమె భర్త పరార్‌‌ అయ్యారు. ఆమె సోదరుడు కూడా పరార్‌‌ అయ్యారు. కొద్ది రోజుల జైలులో ఉన్న తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాదు.. ఆమె భర్త భరత్‌ కూడా అరెస్టు కాకముందే ముందస్తు బెయిల్‌కు మంజూరు చేసింది. కేవలం ఆ ఆస్తి కోసమే ఇంత కుట్ర పన్నినా.. చివరకు ఇప్పుడు ఆ ఆస్తులు భూమా ఫ్యామిలీకి దక్కే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది.

    హఫీజ్‌పేట భూములు తమవేనంటూ భూమా విఖ్యాత్‌ కిడ్నాప్‌ వ్యవహారం తర్వాత ప్రకటించారు. అయితే.. ఆ భూములు వీరివే అయినప్పుడు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం లేదు కదా. వారిని బలవంతంగా కిడ్నాప్‌ చేసి సంతకాలు చేయించేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు..? దీనిపై ఇప్పటివరకు ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అది కూడా బలవంతంగా ఎందుకు సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేశారనేది ఎవరూ స్పష్టం చేయలేదు.

    ఆ హఫీజ్‌పేట భూ వివాదం రచ్చకెక్కడంతో ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించింది. ఆ భూములన్నీ ప్రభుత్వానివి అంటూ తెలంగాణ గవర్నమెంట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ.. ఆ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని కోర్టు స్పష్టతనిచ్చింది. ప్రవీణ్‌రావు ఫ్యామిలీకి సానుకూలంగానే తీర్పు వచ్చిందట. ఈ క్రమంలో ప్రవీణ్‌ రావు కుటుంబానికి భారీ లబ్ధి చేకూరనుంది. ఈ 50 ఎకరాల భూమి వారికే చెందుతుందని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అయితే.. ఇప్పుడు ఏ 50 ఎకరాల భూమి కోసం భూమా ఫ్యామిలీ కిడ్నాప్‌ వ్యవహారం నడిపించిందో చివరకు ఏపాటి లాభం పొందిందో అర్థం కాని పరిస్థితి. ఆ భూములు ప్రవీణ్‌ రావు ఫ్యామిలీకే సొంతం కావడంతో భూమా ఫ్యామిలీకి దక్కింది శూన్యం. ఆ ఏరియాలో ఎక‌రం భూమి దాదాపు 40 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ ల్యాండ్‌ రేటు రూ.2 వేల కోట్లు. ఈ ప్రకారం చూస్తే భూమా ఫ్యామిలీ ఈ 2 వేల కోట్ల ఆస్తిని చేజార్చుకుందని లెక్కలు చెబుతున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్