https://oktelugu.com/

పది, ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే: సుప్రీంలో ఏపీ అఫిడవిట్

సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం దారికొచ్చింది. పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై అఫిడవిట్ సమర్పించింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించేదనే దానిపై క్లారిటీ ఇచ్చింది. బుధవారం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఒక తేదీని ఖాయం చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని.. పరీక్షలు నిర్వహించడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2021 / 07:03 PM IST
    Follow us on

    సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం దారికొచ్చింది. పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై అఫిడవిట్ సమర్పించింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించేదనే దానిపై క్లారిటీ ఇచ్చింది. బుధవారం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

    ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఒక తేదీని ఖాయం చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.

    రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని.. పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

    సుప్రీంకోర్టు నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షలు రద్దు చేస్తారా? లేక నిర్వహిస్తారా? అనే విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ ను ఆదేశించింది.పరీక్షలు జరిపితే పూర్తి వివరాలను అఫిడవిట్ లో తెలుపాలని.. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. వాటిపై విచారణలో పరీక్షలను రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది.

    దేశంలో ఇప్పటివరకు 21 రాష్ట్రాలు రద్దు చేశాయి. కేరళ మాత్రం 11వ తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. సెప్టెంబర్ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. దీంతో సుప్రీంకోర్టు గురువారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.దానికి ఏపీ ఈరోజు దాఖలు చేసింది.