https://oktelugu.com/

స్కూల్ ఫీజుల బాదుడుకు చెక్.. ఇక టీసీలు అవసరం లేదు

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అలజడి రేగుతోంది. ఫీజుల మోత, పుస్తకాల వాత గురించి అప్పుడే ఆందోళన చెందుతున్నారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. సర్కారు నిర్ణయంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇతర స్కూళ్లలో చేరే వారు టీసీల కోసం ఎదురుచూసే సందర్భంలో విద్యాశాఖ వాటి అవసరం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విద్యాశాఖ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 23, 2021 / 07:03 PM IST
    Follow us on

    జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అలజడి రేగుతోంది. ఫీజుల మోత, పుస్తకాల వాత గురించి అప్పుడే ఆందోళన చెందుతున్నారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. సర్కారు నిర్ణయంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇతర స్కూళ్లలో చేరే వారు టీసీల కోసం ఎదురుచూసే సందర్భంలో విద్యాశాఖ వాటి అవసరం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

    విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎనిమిదో తరగతి వరకు టీసీల అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు చేరే క్రమంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడైనా ప్రైవేటు పాఠశాలలు ఇబ్బందులకు గురిచేస్తే డీఈవోలను సంప్రదించాలని సూచించారు.

    ప్రస్తుత విద్యాసంవత్సరంలో నెలన్నర కాలం మాత్రమే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష బోధన జరిగింది. మిగతా కాలం ఆన్ లైన్ తరగతులకే పరిమితమైంది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఫీజులపై కూడా తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యాసంవత్సరం ఫీజులు అధికంగా వసూలు చేసేందుకు విద్యాసంస్థలు సమాయత్తం అవుతున్నాయని తెలుస్తోంది.

    ప్రతి విద్యార్థికి వారి వయసును బట్టి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఫీజు చెల్లింపుతో సంబంధం లేకుండా తమ పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫో డాటా అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులు తమ పాఠశాల నుంచి వెళ్లిపోయినా చైల్డ్ ఇన్ డాటా అప్ డేట్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.