కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఉత్తరాధి కీలక రాష్ట్రాలకు కేంద్రం వేల కోట్ల నిధులు పంచుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మాత్రం బిచ్చం వేసినట్టు నిధులు విదిలిస్తోంది. కేంద్రం చిప్ప చేతికి ఇచ్చి అడుక్కునేలా చేస్తోందన్న ఆవేదన తెలుగు ప్రభుత్వాల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలను కేంద్రం ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటోంది. అయితే తీసుకుంటున్న నిధులన్నీ కూడా కేటాయించకుండా కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాలకే దోచిపెడుతోందన్న ఆవేదన తెలుగు […]

Written By: NARESH, Updated On : July 28, 2020 1:12 pm
Follow us on


బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఉత్తరాధి కీలక రాష్ట్రాలకు కేంద్రం వేల కోట్ల నిధులు పంచుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మాత్రం బిచ్చం వేసినట్టు నిధులు విదిలిస్తోంది. కేంద్రం చిప్ప చేతికి ఇచ్చి అడుక్కునేలా చేస్తోందన్న ఆవేదన తెలుగు ప్రభుత్వాల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలను కేంద్రం ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటోంది. అయితే తీసుకుంటున్న నిధులన్నీ కూడా కేటాయించకుండా కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాలకే దోచిపెడుతోందన్న ఆవేదన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 100శాతం వసూలు చేస్తున్న కేంద్రం.. అందులో 10శాతం కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సమానంగా పంచాల్సిన అవసరం ఉందని ఇక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గుర్రుగా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాలంటే ఏమాత్రం లెక్కలేకుండా వ్యవహరిస్తోందన్న ఆవేదన సీఎం కేసీఆర్, జగన్ లలో ఉంది. నిజానికి తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే ఉమ్మడి ఏపీతో పోల్చితే కర్ణాటక చిన్న రాష్ట్రం.. జనాభా పరంగా.. నిధుల వెచ్చింపు పరంగా చాలా తక్కువే. అయితే అక్కడున్నది బీజేపీ పాలిత రాష్ట్రం.. అందుకే జీఎస్టీ చెల్లింపులో పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటకకు నిధుల వరదను కేంద్రం పారించింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న తెలంగాణ, ఏపీకి ముష్టి విదిల్చిందని ఇక్కడి ప్రభుత్వ వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి

తాజాగా దేశంలోని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధులు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3054 కోట్లు, ఏపీకి రూ.3028 కోట్లు విడుదల చేసింది. రెండూ రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.

అదే సమయంలో దేశంలో ఆర్థిక రాజధాని ముంబై ఉన్న అతిపెద్ద మహారాష్ట్రకు ఆ రాష్ట్ర జనాభాకు సరిపడా 19628 కోట్లు విడుదల చేసింది. ఇక మహారాష్ట్ర అంత లేని బీజేపీ పాలిత కర్ణాటకకు ఏకంగా రూ.18628 కోట్లు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ పాలిస్తుండడమే ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయింపునకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. తమిళనాడుకు రూ.12305 కోట్లు పరిహారం కింద అందించింది. ఇక పంజాబ్ కు సైతం రూ.12187 కోట్లు విడుదల చేసింది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

తెలుగు రాష్ట్రాల కంటే జనాభాలో.. విస్తీర్ణంలో కూడా చిన్నదైన కర్ణాటకకు దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా 18వేల కోట్లు కేటాయించడంపై తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారు. ఇక పంజాబ్ కు సైతం 12వేల కోట్లు ఇచ్చారు. అదే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు దాటకపోవడం గమనార్హం. దీన్ని బట్టి పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్రం.. తెలుగు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని రెండు రాష్ట్రాలు ఆడిపోసుకుంటున్నాయి..