https://oktelugu.com/

బీజేపీని టైం చూసి దెబ్బకొడుతున్న వైసీపీ, టీడీపీ

తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాజకీయ పార్టీలు పార్లమెంటు సమావేశాలు తెగ వాడేసుకుంటున్నాయి. ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు వ్యూహాత్మకంగా బీజేపీని దెబ్బ కొడుతున్నాయి. లోక్ సభ వేదికగా వైసీపీ, టీడీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై బీజేపీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రశ్నలు సంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ ఇప్పుడు మరోసారి అదే విషయమై […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 11:06 am
Follow us on

BJP
తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాజకీయ పార్టీలు పార్లమెంటు సమావేశాలు తెగ వాడేసుకుంటున్నాయి. ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు వ్యూహాత్మకంగా బీజేపీని దెబ్బ కొడుతున్నాయి. లోక్ సభ వేదికగా వైసీపీ, టీడీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై బీజేపీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రశ్నలు సంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ ఇప్పుడు మరోసారి అదే విషయమై పార్లమెంటులో కూడబలుక్కున్న టీడీపీ, వైసీపీ సభ్యులు ప్రశ్నించడం.. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం చేస్తున్నారు. ఇది బీజీపీ నేతలను ఇప్పుడు ఇరుకున పడేస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీని చావుదెబ్బ కొట్టడానికి పథకం ప్రకారమే రెండు పార్టీలు మరోసారి ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీ విభజన చట్టంలో పేర్కోన్న అంశాల హామీల అమలుపై ప్రశ్నించారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇస్తూ… ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేది లేదని స్పష్టం చేశారు.14వ ఆర్థిక సంఘం నివేదికతోనే రాష్ట్రాలకు హోదా ప్రకటించే అంశం ముగిసిందని తెలిపారు. హోదాకు బదులుగా రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ద్వరా ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సమాధానంపై మిథున్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి తాము అంగీకరించలేదని మిథున్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సరైన సమాధానం ఇవ్వకుండా అవమాన కరంగా , బాధ్యతా రాహిత్యంతో సమాధానం ఇచ్చారని ధ్వజం ఎత్తారు.

ఇప్పటికే అనేకసార్లు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేశామని, ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని దోషిగా నిలబెట్టి రాజకీయంగా దెబ్బతీసే కుటర జరుగుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదంతా తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ, టీడీపీ ఆడుతున్న డ్రామాలుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. తిరుపతి వేదికగానే మోదీ హోదాపై హామీ ఇవ్వడం, ఇప్పుడు అదే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీజేపీ నాయకుడు పడిపోయారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని పదేపదే ప్రజాకోర్టులో నిలబెట్టే ఆయుధంగా వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా అంశం పనికి వస్తోంది. ఏది ఏమైనా.. ఢిల్లీలో లోక్ సభ వేదికగా.. కొట్టిన దెబ్బతో తిరుపతిలో బీజేపీ గిలగిలలాడుతోంది.