https://oktelugu.com/

చరణ్ తో మరో స్టార్ హీరో.. త్రివిక్రమ్ కొత్త ఆలోచన !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. నిజానికి చరణ్ ఎప్పటినుండో చరణ్ తో సినిమా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో, ఆ తరువాత బన్నీతో సినిమాలు ఫిక్స్ అయిపోవడంతో ఇక చేసేదేం లేక మిగిలిన పెద్ద దర్శకులను వెతికే పనిలో పడ్డాడు చరణ్. ఈ క్రమంలోనే శంకర్ తో సినిమాని ఖరారు చేసుకున్నాడు. […]

Written By:
  • admin
  • , Updated On : March 24, 2021 / 10:07 AM IST
    Follow us on


    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. నిజానికి చరణ్ ఎప్పటినుండో చరణ్ తో సినిమా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో, ఆ తరువాత బన్నీతో సినిమాలు ఫిక్స్ అయిపోవడంతో ఇక చేసేదేం లేక మిగిలిన పెద్ద దర్శకులను వెతికే పనిలో పడ్డాడు చరణ్. ఈ క్రమంలోనే శంకర్ తో సినిమాని ఖరారు చేసుకున్నాడు. కాగా శంకర్ సినిమా తరువాత సినిమాని త్రివిక్రమ్ తో చేస్తాడట చరణ్.

    Also Read: ఎన్టీఆర్ – ఏఎన్నార్ః సీనియ‌ర్ ఎవ‌రో తెలుసా..?

    ఎంతైనా టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పని చేయాలని, చిన్న హీరో నుండి పెద్ద హీరోలు వరకూ కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్క త్రివిక్రమ్ మాత్రమే.. సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ను అలాగే వారి టైమింగ్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి.. హీరోలను అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాలు తీస్తాడు. పైగా అటు కమర్షియల్ గానూ త్రివిక్రమ్ సినిమాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి, రెవిన్యూ పరంగానూ యూఎస్ లాంటి చోట్ల కూడా ఫుల్ డిమాండ్. అందుకే ఇప్పుడు రాజమౌళి తరువాత హీరోలు వెంట పడుతున్న ఏకైక దర్శకుడు త్రివిక్రమే.

    Also Read: ‘పూజా హెగ్డే’ కొత్తగా.. ఆచార్య కోసమే !

    చరణ్ కూడా త్రివిక్రమ్ తో తన సినిమా ప్లాన్ చేసింది అందుకే. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది త్రివిక్రమ్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని.. ఇద్దరి స్టార్ హీరోల కోసం రాసిన ఓ కథలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉందని.. ఆ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ను గానీ బన్నీ ని గాని పెట్టాలని.. అప్పుడు ఆర్ఆర్ఆర్ తరువాత ఆ రేంజ్ పాన్ ఇండియా సినిమా తనదే అవుతుంది అని.. త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి. త్రివిక్రమ్ స్టార్ హీరోలను ఎలా ఒప్పిస్తాడో. ఒకవిధంగా త్రివిక్రమ్ అడిగితే ఏ హీరో కాదు అనడు. మరి త్రివిక్రమ్ నుండి భారీ మల్టీ స్టారర్ ప్లాన్ అంటే.. భారీ అంచనాలు క్రియేట్ అవ్వడం ఖాయం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్