
తిరుపతి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల వారు అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు. నామినేషన్ కు కూడా సిద్ధం అయ్యారు. అయితే బీజేపీ మాత్రం ఇంకా తర్జన భర్జన పడుతోంది. ఓ రెండు మూడు నెలల నుంచి తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ కసరత్తును కొనసాగిస్తూనే ఉంది. అనవిగా కానీ రాజకీయాన్ని అంతా అక్కడే పండిస్తూ.. వస్తోంది. బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షులు కొద్దిరోజులుగా అక్కడే తిరుపతి చుట్టు చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు.
Also Read: వైరల్ వీడియో: పార్లమెంట్ లో శృంగారం
ఆపై జనసేనతో ఉమ్మడి కార్యాచరణ కూడా తిరుపతి వేదికగానే కొనసాగుతూ ఉంది. ఇంతలో ఎన్నో జరిగాయి. కానీ.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఎవరో మాత్రం ఇంకా తెలుతున్నట్లుగా కనిపించడం లేదు. తిరుపతిలో ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 30 తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. మరి ఈ లోపు అయినా.. బీజేపీ తన అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీకి వస్తుందో.. లేదో అన్న ప్రశ్న అందరిలో ఇప్పుడు మెదులుతోంది.
ఇప్పటికే చాన్నాళ్ల కిందట అభ్యర్థిత్వం విషయంలో వినిపించిన పేర్లే ఇప్పుడు కూడా వినిపిస్తూ.. వస్తున్నాయి. అయితే సదరు అభ్యర్థులు ఇప్పటి వరకు తిరుపతి వైపు తిరిగి చూసిన సందర్భాలు కనిపించలేదు. కనీసం వారికి తిరుపతి లోక్ సభ సీటు పరిధి అయినా తెలుసో.. లేదో మరి.. కర్నాటకలో పనిచేసి రిటైర్డు అయిన ఐఏఎస్ ను తీసుకొచ్చి బీజేపీ పోటీ చేయిస్తుందంటా…
Also Read: బీజేపీని టైం చూసి దెబ్బకొడుతున్న వైసీపీ, టీడీపీ
బహుశా నామినేషన్ల తుదిగడువు రోజున వారు తిరుపతిలో అడుగు పెడతారేమో..? బీజేపీ ఏపీని ఉద్దరిస్తున్న మాత్రానికి ఆఖరి రోజున అభ్యర్థిని తెచ్చి తిరుపతి తిప్పితే.. సీమ జనాలు పొలోమని ఓటేయాలన్న మాట… ఇక తిరుపతిలో తిరుగుతున్న బీజేపీ నేతల చిట్టాలను పరిశీలిస్తే… ఆ నలుగురైదుగురు మాత్రమే మళ్లీ.. ధర్మవరంలో రెండోసారి గెలువలేకపోయిన తెలుగుదేశం నేత, ప్రస్తుత బీజేపీ నేత వరదాపురం సూరి లాంటివాళ్లు తిరుపతిలో బీజేపీ బాధ్యులంటా.. వీరిని చూస్తే.. పడే నాలుగు ఓట్లు కూడా పడతాయో లేదో మరి…?
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్