Sunke Ravishankar: టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలకు మాత్రం ఏం చేయలేకపోయింది. దీంతో సహజంగానే వ్యతిరేకత పెరుగుతోంది. ఇది హుజురాబాద్ ఉప ఎన్నికలోనే స్పష్టంగా తెలిసింది. దీంతో అధికార పార్టీ మూడోసారి కూడా అధికారం చేపట్టాలని కలలు కంటోంది. కానీ అదంత సులభం కాదని అర్థమైపోయింది. అందుకే ఎమ్మెల్యేల పై ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేసేందుకు సర్వే చేయించింది. ఇందులో చాలా మంది మళ్లీ గెలవరనే విషయం తెలిసిపోయింది. దీంతో దిద్దుబాట చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే బలహీనంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలా? కొత్త వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురించి తెలుసుకుందాం. ఈయన నియోజకవర్గంలో తిరుగుతున్నా ప్రజా వ్యతిరేకత ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గం సగం ఆయకట్టు, ఇంకా సగం ఆయకట్టేతర ప్రాంతంగా ఉంది. దీంతో తాగునీరు, సాగునీటి సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సి ఉన్నా రవిశంకర్ ఆశించిన మేర పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయనపై వ్యతిరేకత బలంగా ఉందన్నది వాస్తవం.
నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యలు నెలకొన్నాయి. నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని ఆదుకునే నిమిత్తం మోతె రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇంకా గంగాధర ప్రాజెక్టు కూడా నిర్మించాలని రైతులు కోరుతున్నా అది కూడా సాధ్యం కావడం లేదు. సాగునీరు సమస్య నియోజకవర్గంలో ప్రధానంగా డిమాండ్ ఉన్నా ప్రభుత్వం ఆశించిన మేర పనిచేయడం లేదనే తెలుస్తోంది.
Also Read: అప్పట్లో కెమెరా ట్రిక్కులతోనే దెయ్యాన్ని సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో సమస్యలు ప్రముఖంగా కనిపిస్తున్నా ఎమ్మెల్యే మాత్రం తగు విధంగా స్పందించడం లేదు. వారికి హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చడంలో ముందుకు రావడం లేదు. దీంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోంది. చాలా గ్రామాలకు తాగునీటి కాలువలు తవ్వించి సాగునీరు అందిస్తామని చెప్పినా వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రజల్లోఅసహనం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
మరోవైపు టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరుకు విసుక్కుంటున్నారు. అడిగిన వాటిని కాదని అడగని వాటిని తెరమీదకు తీసుకొచ్చి మేం చేశామని చెబుతున్నా వాటి గురింఇ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఏవో కొత్తగా తీసుకొచ్చి తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమే. ప్రభుత్వం చేసే పనులతో ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నియోజకవర్గం గురించి అంతగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సుంకె రవిశంకర్ పనితీరు బాగా లేదని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సర్వేల ద్వారా వెల్లడవుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ పలు సంస్థల ద్వారా సర్వే నిర్వహించింది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రజల్లో తమ పలుకుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో కేసీఆర్ ఎమ్మెల్యేల భవితవ్యం గురించి ఏం ప్రభావం చూపుతోందో తెలియడం లేదు. ఈ మేరకు కేసీఆర్ మదిలో ఏముందో కూడా అంతుబట్టడం లేదని చెబుతున్నారు.