https://oktelugu.com/

Home Vastu Tips: ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు.. చేస్తే అరిష్టమే!

Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పట్ల ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి.అందుకని వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులను గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితులలో కూడా చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మరి గుమ్మం దగ్గర చేయకూడని పనులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2022 / 11:36 AM IST

    Home Vastu Tips

    Follow us on

    Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పట్ల ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి.అందుకని వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులను గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితులలో కూడా చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మరి గుమ్మం దగ్గర చేయకూడని పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మం పై కూర్చొని ఎలాంటి పరిస్థితులలో భోజనం చేయకూడదు. అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించకూడదు.చాలామంది గుమ్మం పై కూర్చొని ఇతర పనులను చేస్తుంటారు పొరపాటున కూడా ఈ పని చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు. అలాగే చాలా మంది ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తద్వారా ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

    అలాగే గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారాన్ని తినకూడదు. ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా వేలాడదీయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఈశాన్య మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.