ఆ చానళ్ల ‘తప్పు’టడుగులు..: రేటింగ్‌ పెంచుకునేందుకు భారీ కుట్ర

ప్రజలకు సమాచార స్రవంతిని చేరవేయాల్సిన మీడియా ‘తప్పు’టడుగులు వేస్తోంది. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన చానళ్లు తమ ఉనికిని చాటుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నాయి. మొన్నటికి మొన్న ఈ తంతు హిందీ, ఇంగ్లిష్ చానళ్ల యాజమాన్యాల్లో చూశాం. అయితే.. తాజాగా ఇదే ఉదంతం తెలుగు మీడియాలోనూ నడుస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. Also Read: త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు..: ఆ మంత్రులు చెప్పేశారుగా.. టీవీ చానళ్లకు రేటింగ్‌లు ఇచ్చే సంస్థ బార్క్ మాజీ చైర్మన్ పార్దోదాస్ గుప్తా ప్రస్తుతం జైల్లో […]

Written By: Srinivas, Updated On : January 21, 2021 11:37 am
Follow us on


ప్రజలకు సమాచార స్రవంతిని చేరవేయాల్సిన మీడియా ‘తప్పు’టడుగులు వేస్తోంది. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన చానళ్లు తమ ఉనికిని చాటుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నాయి. మొన్నటికి మొన్న ఈ తంతు హిందీ, ఇంగ్లిష్ చానళ్ల యాజమాన్యాల్లో చూశాం. అయితే.. తాజాగా ఇదే ఉదంతం తెలుగు మీడియాలోనూ నడుస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.

Also Read: త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు..: ఆ మంత్రులు చెప్పేశారుగా..

టీవీ చానళ్లకు రేటింగ్‌లు ఇచ్చే సంస్థ బార్క్ మాజీ చైర్మన్ పార్దోదాస్ గుప్తా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ స్కాంపై విచారణ జరుపుతున్నారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ చానళ్ల రేటింగ్‌లనే కాదు.. ప్రాంతీయ చానళ్ల రేటింగ్‌లు కూడా ట్యాంపర్ చేసినట్లుగా తేలింది. ఏబీఎన్, టీవీ ఫైవ్ లాంటి చానళ్ల రేటింగ్‌ను తగ్గించి టీవీ9, సాక్షి రేటింగ్ పెంచడానికి కుట్ర జరిగింది.

కొన్ని తెలుగు చానళ్ల రేటింగ్‌ను అమాంతం పెంచి.. మరికొన్ని రేటింగ్స్‌ను మాత్రం తగ్గించారు. బార్క్ కొత్త కార్యవర్గం రేటింగ్స్ మొత్తాన్ని ఫోరెన్సిక్ అడిట్ చేయడంతో విషయం బయటపడింది. వీటికి సంబంధించిన ఈ–మెయిల్ సంభాషణలు కూడా వెలుగు చూశాయి. నిజానికి ఈ రేటింగ్ వ్యవహారాన్ని పార్ధోదాస్ హయాంలో బోగస్‌గా మార్చారు. కొన్ని చానళ్లను అదే పనిగా చూసేవారు లేకపోయినా ఎక్కువగా చూపించాలని ప్లాన్ చేశారు. ఇలా మొత్తంగా రిగ్గింగ్‌ చేసి తెలుగు ఛానల్స్‌ రేటింగ్స్‌ను 39 శాతం పెంచారు. అదే స్థాయిలో ఏబీఎన్ లాంటి చానళ్ల రేటింగ్‌ను తగ్గించారు. దీని వల్ల ఆయా చానళ్లు చాలా నష్టపోయాయి.

Also Read: దుర్గగుడి వెండి సింహాల కేసులో దొంగ దొరికాడు

మొత్తంగా ఇంగ్లిష్‌, హిందీ చానల్స్‌లోనే కాకుండా తెలుగు చానల్స్‌లోనూ ఇలాంటి రిగ్గింగ్‌ జరిగినట్లు ఆడిట్‌ తేల్చింది. ప్రధానంగా ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న రెండు చానళ్ల రేటింగ్‌లను అనుకూలంగా రేటింగ్‌లను బార్క్‌ మార్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కొన్ని మీడియా సంస్థల మెడకు చుట్టుకోనుంది. ముంబై పోలీసులు ఇప్పుడు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్