https://oktelugu.com/

ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్‌‌..!

ఏపీ ప్రభుత్వానికి మళ్లీ షాక్‌ల మీద షాక్‌లు తలుగుతున్నాయి. అమరావతిలో ఇన్‌సైడర్‌‌ ట్రేడింగ్‌ లేదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సర్కార్‌‌ మళ్లీ పై స్థాయిలో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అయితే.. హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌కు వెళ్లడమా.. లేక సుప్రీంకు వెళ్లడమా అన్న ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ.. సీబీఐ ఇంతవరకూ పరిశీలించలేదు. Also Read: దుర్గగుడి వెండి సింహాల కేసులో దొంగ దొరికాడు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 / 12:04 PM IST
    Follow us on


    ఏపీ ప్రభుత్వానికి మళ్లీ షాక్‌ల మీద షాక్‌లు తలుగుతున్నాయి. అమరావతిలో ఇన్‌సైడర్‌‌ ట్రేడింగ్‌ లేదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సర్కార్‌‌ మళ్లీ పై స్థాయిలో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అయితే.. హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌కు వెళ్లడమా.. లేక సుప్రీంకు వెళ్లడమా అన్న ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ.. సీబీఐ ఇంతవరకూ పరిశీలించలేదు.

    Also Read: దుర్గగుడి వెండి సింహాల కేసులో దొంగ దొరికాడు

    అంతేకాదు.. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా దీని గురించి ప్రస్తావిస్తుంటారని చెబుతారు. అయితే.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన అంశమని.. అసలు ఆ పదమే భారత శిక్షా స్పృతిలో లేదని హైకోర్టు తేల్చేయడంతో ఇప్పుడు సీబీఐ కూడా ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అందుకే తీర్పు విషయంలో సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైకోర్టు తీర్పును ఓ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో క్షుణ్ణంగా పరిశీలింపచేస్తున్నారు. ప్రభుత్వానికి అనధికారిక న్యాయసలహాదారుగా ఆయన వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కీలకమైన వ్యవహారాలు అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుపుతున్నారు.

    ఇప్పుడు..ఈ వ్యవహారంలోనూ ఆయన ఏయే పాయింట్లను లీడ్‌గా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలో గైడ్ చేయబోతున్నారు. ఆయన ఇచ్చే పాయింట్లను ఆధారంగా చేసుకుని సాంకేతిక అంశాల ఆధారంగా అయినా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైనా సుప్రీంకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేస్తారని చెబుతున్నారు.

    Also Read: జగన్ కు మైండ్ బ్లాంక్.. ఏపీలో ఎన్నికలకు హైకోర్టు ఆదేశం

    అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే కేసులే లేకపోతే అమరావతిలో అవినీతి అనేదే ఉండదు. ఇప్పుడు అలాంటి కేసులు పెట్టడానికి కూడా చాన్స్ ఉండదు. దీంతో వైసీపీ సర్కార్ అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే తీర్పుపై స్టే కోసం అటు హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇటు.. సుప్రీంకోర్టు అయినా సరే తీవ్రంగా ప్రయత్నించాలని నిర్ణయించారు. చివరకు ఆ ఫలితం కూడా ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్