https://oktelugu.com/

తెలంగాణ జోనల్ వ్యవస్థ.. ఎవరికి లాభం? ఏంటి మతలబు?

తెలంగాణది అస్తిత్వ పోరాటం.. ‘నీళ్లు నిధులు నియామకాల’ కోసం ఏళ్లుగా ఇక్కడి సమాజం పోరాడింది. నీళ్లు దక్కించుకుంది. కాళేశ్వరం సహా పాలమూరు-రంగారెడ్డిని పట్టాలెక్కించింది. తెలంగాణ వ్యాప్తంగా పారించి జలకళను తెచ్చింది. నిధులు సమకూర్చుకుంది. పెట్టుబడులతో, వ్యవసాయంతో దేశానికి ధాన్యాగారంగా నిలిచింది. కానీ నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ అంతులేని జాప్యం ప్రదర్శించింది. అదే ఇప్పుడు తెలంగాణ కోసం కొట్టాడిన నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహానికా కారణమైంది. వారంత బీజేపీ బాట పట్టి గులాబీని ఓడగొట్టాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 / 08:50 AM IST
    Follow us on

    తెలంగాణది అస్తిత్వ పోరాటం.. ‘నీళ్లు నిధులు నియామకాల’ కోసం ఏళ్లుగా ఇక్కడి సమాజం పోరాడింది. నీళ్లు దక్కించుకుంది. కాళేశ్వరం సహా పాలమూరు-రంగారెడ్డిని పట్టాలెక్కించింది. తెలంగాణ వ్యాప్తంగా పారించి జలకళను తెచ్చింది. నిధులు సమకూర్చుకుంది. పెట్టుబడులతో, వ్యవసాయంతో దేశానికి ధాన్యాగారంగా నిలిచింది. కానీ నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ అంతులేని జాప్యం ప్రదర్శించింది. అదే ఇప్పుడు తెలంగాణ కోసం కొట్టాడిన నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహానికా కారణమైంది. వారంత బీజేపీ బాట పట్టి గులాబీని ఓడగొట్టాలని ప్రతినబూనారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో అదే చేశారు.

    ఇక మరో వైపు కొత్తగా తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిల ఈ నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా తీసుకొని నిరుద్యోగులను నిద్రలేపుతూ తెలంగాణ సర్కార్ ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇక కొత్తగా పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి సైతం దీన్నే ప్రధాన అజెండాగా ఎత్తుకున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ అలెర్ట్ అయ్యింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థపై మార్పులు, చేర్పులు చేసి జీవో విడుదల చేసింది.

    కేంద్రం తెలంగాణ జోనల్ వ్యవస్తలో మార్పులకు ఆమోదం తెలుపడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్చులు చేసింది.

    జోనల్ వ్యవస్థ ఏర్పాటు తర్వాత పుట్టుకొచ్చిన నారాయణపేట జిల్లాను జోగులాంబ జోన్ లో.. ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్ లో చోటు కల్పించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి తీసేసి చార్మినార్ జోన్ కు మార్పు చేశారు.

    ఇక నుంచి ఈ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతోపాటు స్థానికతకు పెద్దపీట వేస్తారు. కొత్త జోన్లతో తెలంగాణప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారు. రాష్ట్ర స్తాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. గ్రూప్ 1 పోస్టులు కూడా మల్టీ జోనల్ స్థాయిలోనే నియమిస్తారు. దీని వల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే లభిస్తాయి.

    ఇక కొత్త జోన్ ఏర్పాటుతో జిల్లా స్థాయి పోస్టుల్లో కూడా గ్రామీణ ప్రాంత జిల్లాల యువతకు ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం కొత్త జిల్లాలతో ఏర్పడింది. మల్టీ జోనల్ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాలన్నీ కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే భర్తీ అవుతాయి.