https://oktelugu.com/

కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు చట్ట సవరణ 2020 ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే ప్రస్తుతం దేశంలో ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్న పలు రాష్ట్రాలలోని రైతుల పాలిట పిడుగుపాటుగా మారనున్నది. ఈ ముసాయిదా చట్టరూపం దాలిస్తే ప్రతి కనెక్షన్‌కీ మీటర్‌ పెట్టాల్సివస్తుంది. గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా! తెలంగాణలోనే ప్రస్తుతం 24.4 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. చట్టం అమల్లోకి వస్తే ప్రతి కనెక్షన్‌కు త్రీఫేజ్‌ మీటర్‌ను బిగించాల్సి ఉంటుంది. ఒక్కో మీటర్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 8, 2020 5:43 pm
    Follow us on


    కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు చట్ట సవరణ 2020 ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే ప్రస్తుతం దేశంలో ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్న పలు రాష్ట్రాలలోని రైతుల పాలిట పిడుగుపాటుగా మారనున్నది. ఈ ముసాయిదా చట్టరూపం దాలిస్తే ప్రతి కనెక్షన్‌కీ మీటర్‌ పెట్టాల్సివస్తుంది.

    గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!

    తెలంగాణలోనే ప్రస్తుతం 24.4 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. చట్టం అమల్లోకి వస్తే ప్రతి కనెక్షన్‌కు త్రీఫేజ్‌ మీటర్‌ను బిగించాల్సి ఉంటుంది. ఒక్కో మీటర్‌ ఖరీదు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తంపై రూ.425 కోట్లకు పైగా భారం మీటర్ల మీదనే పడుతుందని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలలోని డిస్కోమ్ లు ఇంతటి భారాన్ని మోసే పరిస్థితులలో లేవు. ఇక రైతులకు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వస్తాయి. నెలకు రూ 3,000 నుండి రూ 5,000 వరకు భారం పడే అవకాశం ఉంటుంది.

    ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

    కొత్త చట్టం ముసాయిదా ప్రకారం.. విద్యుత్‌ చార్జీలపై ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తారు. అంటే ఇప్పుడు గ్యాస్‌ సబ్సిడీని నేరుగా మన ఖాతాల్లోనే జమచేస్తున్న విధానమన్నమాట.

    గ్యాస్‌రేటు ఎంత పెరిగినా ప్రభుత్వం మాత్రం ఆ మేరకు సబ్సిడీ మొత్తాన్ని పెంచదు. పెరిగిన మొత్తాన్ని వినియోగదారులు చెల్లించాల్సిందే. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలపై సబ్సిడీ వ్యవహారంకూడా అలాగే ఉండే అవకాశం ఉంది. అల్పాదాయ వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలపై కూడా విద్యుత్తు ఛార్ఝీలు పిడుగులా పడనున్నాయి.