
అల్లు అర్జున్ అలియాస్ బన్నీ స్టార్ గా మారడానికి దోహద పడిన చిత్రం ” ఆర్య “.. 2004 మే ఏడో తారీఖున విడుదల అయిన ఈ చిత్రం అప్పటివరకు వచ్చిన లవ్ చిత్రాలకు భిన్నం గా రూపొందటమే గాక బన్నీ కెరీర్ లో మరపురాని చిత్రంగా మిగిలి పోయింది .నిజానికి ఈ చిత్రం లో ప్రభాస్ హీరోగా నటించాల్సి ఉంది. తొలుత కథను పూర్తి చేసిన సుకుమార్, ‘దిల్’ రాజును కలవగా ఆయన ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడట. దాంతో ఈ కథను పట్టుకుని సుకుమార్ చాలామంది హీరోలను కలిశాడట..
గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!
ఆ క్రమంలో ఈ కథను పట్టుకుని ప్రభాస్ ను కలిశాడట. అతనికి కథ చెప్పిన తర్వాత, ఎక్కడైనా మార్పులు చేర్పులు వుంటే చెప్పమని, వాటిని సరిచేస్తానని సుకుమార్ చెప్పాడట. అయినా ప్రభాస్ ఎందుకో ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. కానీ అల్లు అర్జున్ ను రిఫర్ చేయడం జరిగిందట. అలా ప్రభాస్ ద్వారా బన్నీ కి చేరిన ‘ఆర్య’ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. సెన్సేషనల్ హిట్ అయ్యింది 4 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లను రాబట్టి బన్నీ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా మారిపోయింది. .కాగా ఈ విషయాన్ని బన్నీ స్వయంగా `బిల్లా ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ,ప్రభాస్ సమక్షంలో చెప్పడం జరిగింది. .