రైతులను దగా చేస్తున్న కేసీఆర్…

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తానని గొప్పలు చెప్పుకొని ఇప్పటి వరకు 20 టన్నులు కూడా కొనలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం దేశంలో తానొక్కడినే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నరని అంటూ మొత్తం 17 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 5:59 pm
Follow us on


తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తానని గొప్పలు చెప్పుకొని ఇప్పటి వరకు 20 టన్నులు కూడా కొనలేదని ఎద్దేవా చేశారు.

కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం

దేశంలో తానొక్కడినే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నరని అంటూ మొత్తం 17 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వాలు తమ ధాన్యం కొనుగోళ్లపై నిత్యం బులెటిన్ లను విడుదల చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదని నిలదీశారు.

రైతులు, పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకురారని కేసీఆర్ క్వారంటైన్ సీఎం అని మండిపడ్డారు. ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ క్వారంటైన్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు. అప్పుడప్పుడు నేను బతికే ఉన్నాన‌ని చెప్పేందుకు బయటకి వస్తారని, ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడతారని అంటూ ధ్వజమెత్తారు.

ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం ఒక దళారిగా వ్యవహరించడం తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని సంజయ్ చెప్పారు. గన్ని బస్తాలు, రవాణా చార్జీలు … ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని సంజయ్ గుర్తు చేశారు.

మద్యం ఎఫెక్ట్… సరిహద్దు అలెర్ట్!

రైతు పంట దగ్ధం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే అది ఈ ప్రభుత్వ చేతకాని తనమ‌ని సంజయ్ విమర్శించారు. కేంద్ర నిధుల మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవంక కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో క‌రోనా కేసులు పెరిగాయని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.టెస్టులు జరగాలని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారని ధ్వజమెత్తారు.

లాక్ డౌన్ లో రోడ్ల మీద బరితెగించి తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. పాతబస్తీలో అసలు ప్రభుత్వమే లేదని విమర్శించారు.